2023 లో ఒక్క సినిమా కూడా రిలీజ్ చేయని హీరోలు వీరే…!

2023 లో ఒక్క సినిమా కూడా రిలీజ్ చేయని హీరోలు వీరే…!

by Mounika Singaluri

Ads

2023 సంవత్సరం దాదాపు చివరి దశకు చేరుకుంది. ఈ సంవత్సరం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి హీరో ఏదో ఒక సినిమా అయినా రిలీజ్ చేశారు. కానీ కొంతమంది హీరోలు మాత్రం ఈ ఏడాది ఒక్క సినిమా కూడా రిలీజ్ చేయలేదు.

Video Advertisement

వారిలో స్టార్ హీరోలు కూడా ఉండడం గమనార్హం. ఒకసారి వారి లిస్టు పరిశీలిస్తే…!

trolls on thaman about mahesh gunturu karam mass strike music..!!

1. రామ్ చరణ్:

రామ్ చరణ్ ఈ ఏడాది ఒక్క సినిమా కూడా రిలీజ్ చేయలేదు. ఈయన చివరిగా కనిపించిన సినిమా ఆచార్య. ప్రస్తుతం శంకర్ డైరెక్షన్ లో గేమ్ చేంజర్ సినిమాలో నటిస్తున్నారు అది వచ్చే ఏడాది విడుదల కానుంది.

2. ఎన్టీఆర్:

జూనియర్ ఎన్టీఆర్ కూడా ఏడాది తన సినిమా ఏది విడుదల చేయలేదు. ఈయన చివరిగా కనిపించిన సినిమా ఆర్ఆర్ఆర్. ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్ లో దేవర సినిమాలో నటిస్తున్నారు. ఇది వచ్చే ఏడాది ఏప్రిల్ లో విడుదల కానుంది.

3. అల్లు అర్జున్:
అల్లు అర్జున్ కూడా ఏడాదంతా తన సినిమాని విడుదల చేయలేదు. ఈయన చివరిగా నటించిన సినిమా పుష్ప ప్రస్తుతం పుష్ప 2లో నటిస్తున్నారు. ఇది వచ్చే ఏడాది ఆగస్టులో విడుదల కానుంది.

4. వెంకటేష్:

విక్టరీ వెంకటేష్ నటించిన ఏ సినిమా కూడా ఈ సంవత్సరం థియేటర్లలోకి రాలేదు. ఇయన చివరిగా ఎఫ్3 సినిమాలో నటించారు. తాజాగా వెంకటేష్ నటించిన సైంధవ్ సినిమా డిసెంబర్ లో విడుదల కావాల్సి ఉండగా పోస్ట్ పోన్ అయ్యి 2024 సంక్రాంతికి రానుంది.

5. నాగార్జున:

నాగార్జున కూడా ఈ సంవత్సరం ఏ సినిమా చేయలేదు. నాగార్జున చివరిగా నటించిన చిత్రం ఘోస్ట్. ప్రస్తుతం నాగార్జున నా స్వామి రంగా మూవీలో నటిస్తున్నారు ఇది సంక్రాంతికి విడుదల కానుంది.

6. మహేష్ బాబు:
మహేష్ బాబు కూడా ఈ సంవత్సరం ఏ సినిమాని విడుదల చేయలేదు మహేష్ చివరిగా నటించిన సినిమా సర్కార్ వారి పాట. మహేష్ నెక్స్ట్ సినిమా గుంటూరు కారం సంక్రాంతి కానుకగా విడుదల కానుంది


End of Article

You may also like