Ads
సాధారణంగా అయితే మన హీరోలు సంవత్సరానికి ఒక సినిమా అనే పాలసీ ఫాలో అవుతారు. కానీ ఒకసారి ఈ పాలసీ బ్రేక్ అవుతుంది. ఒకే సంవత్సరంలో వాళ్లు నటించిన ఒకటి కంటే ఎక్కువ సినిమాలు విడుదల అవుతాయి. అలా ఈ సంవత్సరం ఒకటి కంటే ఎక్కువ రిలీజ్ లు ఉన్న హీరోలు ఎవరో ఆ సినిమాలు ఏవో ఇప్పుడు చూద్దాం.
Video Advertisement
#1 నితిన్
నితిన్ హీరోగా చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో రాబోతున్న చెక్ సినిమా, అలాగే మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రాబోతున్న హిందీలో సూపర్ హిట్టయిన అంధాధున్ సినిమా రీమేక్ కూడా ఈ సంవత్సరం విడుదల కాబోతోంది. అంతే కాకుండా వెంకీ అట్లూరి దర్శకత్వంలో కీర్తి సురేష్ హీరోయిన్ గా వస్తున్న రంగ్ దే సినిమా కూడా ఈ సంవత్సరం విడుదలవుతుంది.
#2 శర్వానంద్
శర్వానంద్ హీరోగా కిషోర్ దర్శకత్వంలో రూపొందిన శ్రీకారం సినిమా ఈ సంవత్సరం మార్చిలో విడుదల అవ్వబోతోంది, అలాగే అజయ్ భూపతి దర్శకత్వంలో రాబోతున్న మహాసముద్రం సినిమా కూడా ఈ సంవత్సరం ఆగస్టులో విడుదల అవుతుంది.
#3 రానా దగ్గుబాటి
వేణు ఉడుగుల దర్శకత్వంలో రూపొందిన విరాటపర్వం, అలాగే పాన్ ఇండియన్ సినిమాగా విడుదలవుతున్న అరణ్యతో పాటు అయ్యప్పనుం కోషియుం కూడా ఈ సంవత్సరం ప్రేక్షకుల ముందుకు రానుంది.
#4 వరుణ్ తేజ్
2019 లో విడుదలై బ్లాక్ బస్టర్ అయిన ఎఫ్ 2 కి సీక్వెల్ గా రూపొందుతున్న ఎఫ్3, అలాగే బాక్సింగ్ నేపథ్యంలో రాబోతున్న గని సినిమా కూడా ఈ సంవత్సరం విడుదల అవుతుంది.
#5 పవన్ కళ్యాణ్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా శ్రీరామ్ వేణు దర్శకత్వంలో రూపొందుతున్న వకీల్ సాబ్, అలాగే సాగర్ కే చంద్ర దర్శకత్వంలో రూపొందుతున్న అయ్యప్పనుం కోషియుం సినిమా రీమేక్ కూడా ఈ సంవత్సరం విడుదల అవుతుంది.
#6 ఆది
ఆది సాయి కుమార్ హీరోగా నటించిన శశి ఇంకా జంగిల్ సినిమాలు ఈ సంవత్సరం విడుదల అవ్వబోతున్నాయి.
#7 నాని
శివ నిర్వాణ దర్శకత్వంలో రాబోతున్న టక్ జగదీష్ తో పాటు శ్యామ్ సింగ రాయ్ కూడా ఈ సంవత్సరంలో విడుదల అవుతుంది.
#8 అల్లరి నరేష్
జనవరిలో బంగారు బుల్లోడుతో అలరించిన అల్లరి నరేష్, ఫిబ్రవరిలో క్రైమ్ థ్రిల్లర్ అయిన నాంది సినిమాతో ప్రేక్షకులను పలకరించారు.
#9 వెంకటేష్
అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఎఫ్3 తో పాటు, నారప్ప సినిమా కూడా ఈ సంవత్సరం విడుదల అవుతుంది.
#10 రవితేజ
సంవత్సరం మొదట్లో విడుదలైన క్రాక్ సినిమాతో ప్రేక్షకులను అలరించిన రవితేజ, మళ్లీ ఖిలాడీ సినిమాతో మన ముందుకు రాబోతున్నారు.
#11 రామ్ చరణ్
దేశం మొత్తం ఎదురు చూస్తున్న ఆర్ఆర్ఆర్, ఇంకా ఆచార్య ఈ సంవత్సరం ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.
#12 నాగ శౌర్య
నాగ శౌర్య హీరోగా రూపొందిన లక్ష్య, అలాగే వరుడు కావలెను సినిమాలు ఈ సంవత్సరం విడుదల అవ్వబోతున్నాయి.
End of Article