Ads
సినిమాల్లో నటులు కూడా మనలాంటి మనుషులే కాబట్టి వాళ్లలో కూడా అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయి. సినిమాల్లో అన్నిటికంటే ముఖ్యమైనది హీరో క్యారెక్టరైజేషన్. కొన్ని సినిమాల్లో హీరోలని మంచి వాళ్ళుగా చూపిస్తే, ఇంకొన్ని సినిమాల్లో హీరోల వల్ల కూడా కొన్ని పొరపాట్లు అవుతుంటాయి.
Video Advertisement
కొన్ని సినిమాల్లో అయితే తన పక్క వారి కోసం హీరో ఎన్నో త్యాగాలు చేస్తాడు. అలా తమ గురించి ఆలోచించకుండా వేరే వాళ్ల కోసం త్యాగాలు చేసిన కొంత మంది ఎవరో ఇప్పుడు చూద్దాం.
#1 జగపతి బాబు
బడ్జెట్ పద్మనాభం
ఈ సినిమాలో జగపతి బాబు తన ఇంటి కోసం ఫైట్ చేస్తూ ఉంటారు. కానీ చివరికి ఆ ఇల్లు వదిలేసుకుంటారు.
శుభాకాంక్షలు
ఈ సినిమాలో జగపతి బాబు ప్రేమించిన అమ్మాయి వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటుంది.
#2 శ్రీకాంత్
ప్రేయసి రావే
ఈ సినిమాలో రాశి భర్త అయిన పృథ్వికి గుండె దానం చేస్తారు శ్రీకాంత్.
కన్యాదానం
ఈ సినిమాలో శ్రీకాంత్ పెళ్లి చేసుకున్న రచన ఉపేంద్రని ఇష్టపడుతుంది అని తెలిసి వారిద్దరిని కలుపుతారు.
#3 వెంకటేష్
రాజా
ఈ లిస్ట్ లో విక్టరీ వెంకటేష్ పేరు రాకుండా ఉండడం జరగదు. అందులోనూ రాజా సినిమా గురించి రాకుండా ఉండడం అయితే అస్సలు జరగదు. సినిమా పేరు చూడంగానే సినిమా చివరిలో వచ్చే స్పీచ్, ఆ సీన్ లో ఉండే బ్యాగ్రౌండ్ మ్యూజిక్ మీలో చాలా మందికి గుర్తొచ్చే ఉంటుంది.
సంక్రాంతి
ఈ సినిమాలో కూడా తన ప్రేమ కంటే తన కుటుంబమే ముఖ్యం అనుకునేలా ఉంటుంది వెంకటేష్ పాత్ర.
సూర్యవంశం
ఈ సినిమాలో “భానుప్రసాద్”(చిన్న వెంకటేష్) పడిన అవమానాలు అంత ఇంత కాదు. తండ్రి నుండి ప్రేమించిన అమ్మాయి వరకు అందరు అవమానించారు.
#4 కార్తి
ఖాకీ
ఈ సినిమాలో డ్యూటీ కే ప్రయారిటి ఇస్తారు. రకుల్ హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా ఆ బాధ తట్టుకొని మిషన్ కంటిన్యూ చేస్తారు. తర్వాత మిషన్ లో ఉన్నప్పుడు రకుల్ పాత్ర చనిపోయినట్టు చెప్తారు.
#5 నాని
జెర్సీ
ఈ సినిమాలో తన కొడుకు సంతోషం చూడడం కోసం హీరో ఏం కావాలన్నా చేస్తాడు.
#6 వేణు తొట్టెంపూడి
చెప్పవే చిరుగాలి
తను ప్రేమించిన అమ్మాయి కోసం హీరో పాత్ర చాలా కష్టపడతాడు.
#7 నాగార్జున
నువ్వు వస్తావని
నాగార్జున ఎమోషనల్ రోల్స్ లో కూడా చాలా బాగా నటించగలరు అని ప్రూవ్ చేసిన సినిమా ఇది.
#8 రజినీకాంత్
లింగ
ఈ సినిమాలో హీరో తన ఊరి వాళ్ళ బాగు కోసం ఆస్తి మొత్తాన్ని త్యాగం చేసేస్తారు.
#9 మంచు మనోజ్
పోటుగాడు
ఇందులో మొదటినుంచి చివరి వరకు హీరో పాత్ర తను ప్రేమించిన అమ్మాయిలందరిని వదిలేసినట్లు చూపిస్తారు. కానీ క్లైమాక్స్ లో హీరో అలా చేయడానికి గల కారణాలు చెప్తాడు.
#10 రాజశేఖర్
మా అన్నయ్య
ఈ సినిమాలో రాజశేఖర్ తన తమ్ముళ్ళ కోసం ఎంత ఆలోచిస్తారో టైటిల్ చూస్తేనే మనందరికీ అర్థమైపోతుంది.
#11 రవితేజ, అల్లరి నరేష్, శివ బాలాజీ
శంభో శివ శంభో
ఇందులో వాళ్ళ ఫ్రెండ్ ప్రేమని గెలిపించడానికి చాలా కష్టపడతారు. దానివల్ల చాలా మంది తో ఫైట్ చేస్తారు.
#12. చిరంజీవి – స్నేహం కోసం
End of Article