Ads
నటి ప్రణీత సుభాష్ వివాహం చేసుకున్నారు. ఆదివారం నగర శివార్ల వద్ద ఆమె ఇంటిలోనే కుటుంబ సభ్యులు, సన్నిహితుల నడుమ ఆమె వివాహం జరిగిపోయింది. ప్రముఖ వ్యాపారవేత్త నితిన్ రాజు తో ప్రణీత వివాహం నిశ్చయమైంది. అయితే.. పెద్ద గా ప్రచారం లేకుండా.. సాధారణంగా వీరిద్దరూ వివాహం చేసుకున్నారు.
Video Advertisement
ఈ పెళ్లి గురించి ప్రణీత చాలా సంతోషం గా ఉన్నారు. ఆమె మాట్లాడుతూ..” మేమిద్దరం చాలాకాలం గా ఒకరినొకరు తెలుసుకుంటూ ఉన్నాం. మా వివాహం లవ్ కం అరేంజ్డ్. మేము ప్రేమించుకుని, పెద్దలను ఒప్పించుకునే పెళ్లి చేసుకుంటున్నాం. కరోనా నేపధ్యం లో వివాహం చేసుకోవడానికి చాలా కాలం వెయిట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి కరోనా ప్రోటోకాల్ ను అనుసరిస్తూ పరిమిత కుటుంబ సభ్యుల మధ్యే ఈ వేడుకని జరుపుకున్నాం..” అంటూ చెప్పుకొచ్చింది. కరోనా ఫస్ట్ వేవ్ లాక్ డౌన్ టైం లో ప్రణీత చొరవ గా ఉండి ఎంతో మందికి ఆహరం అందించిన సంగతి తెలిసిందే.
End of Article