Home Filmy Adda Bollywood Chatrapthi : బాలీవుడ్ ఛత్రపతి కి హీరోయిన్ దొరికేసింది.. ఎవరంటే..?

Bollywood Chatrapthi : బాలీవుడ్ ఛత్రపతి కి హీరోయిన్ దొరికేసింది.. ఎవరంటే..?

by Anudeep

టాలీవుడ్ నటుడు బెల్లంకొండ శ్రీనివాస్ తెలుగు లో సూపర్ హిట్ అయిన “ఛత్రపతి” సినిమాను బాలీవుడ్ లో రీమేక్ చేయనున్న సంగతి తెలిసిందే. ఈ రీమేక్ సినిమా ద్వారా బెల్లం కొండ శ్రీనివాస్ బాలీవుడ్ లో తెరంగ్రేటం చేయనున్నారు. కాగా.. ఈ ఛత్రపతి రీమేక్ కు సంబంధించి ఇటీవలే పూజ కార్యక్రమాలు కూడా పూర్తి అయ్యారు.

bollywood chatrapthi

ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించి అప్ డేట్స్ ఏమి రాలేదు. ఐతే.. ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరు ఉంటారన్న విషయమై తెలుగు ఆడియన్స్ కొంచం క్యూరియాసిటీ తోనే ఉన్నారు. తాజాగా.. ఈ ప్రశ్న కి ఆన్సర్ దొరికేసింది. బాలీవుడ్ లో రీమేక్ కానున్న ఛత్రపతి సినిమా లో రెజినా ను హీరోయిన్ గా తీసుకున్నారని సమాచారం. తొలుత బాలీవుడ్ హీరోయిన్లను తీసుకోవాలని భావించారు. కానీ కుదరకపోవడం తో టాలీవుడ్ హీరోయిన్ ను తీసుకున్నారట.

You may also like