Ads
ఎన్నో రోజులు వెయిట్ చేసిన తర్వాత కేజీఎఫ్ చాప్టర్-2 విడుదల అయ్యింది. కేజీఎఫ్ మొదటి భాగం ఎవరూ ఊహించనంత పెద్ద హిట్ అయ్యింది. మొదటి భాగం మొత్తంలో కూడా రాకీ భాయ్ ఎలా ఎదిగాడు అనేది చూపించారు. రెండవ భాగంలో మాత్రం రాకీ భాయ్ ఎదిగిన తర్వాత తాను ఎదుర్కొన్న సమస్యలు ఏంటి అనేది చూపించారు? మొదటి భాగంలాగానే ఈ సినిమా కూడా పవర్ ఫుల్ గా ఉంటుంది.
Video Advertisement
అసలు రాకీ భాయ్ ని జనాలు అందరూ అంత గుర్తు పెట్టుకునే అంతగా ఏం చేసాడు అనేది ఈ సినిమాలో చూపించారు. కానీ మొదటి భాగంతో పోలిస్తే ఈ సినిమాలో ఎమోషన్స్ కొంచెం తక్కువగా ఉన్నట్టు అనిపిస్తాయి. అలాగే విలన్ పాత్ర కూడా మనం చాలా సినిమాల్లో చూసినట్టే అనిపిస్తుంది. కానీ యాక్షన్ సీన్స్ మాత్రం చాలా బాగా డిజైన్ చేశారు.
సినిమాలో శ్రీనిధి శెట్టి పోషించిన హీరోయిన్ పాత్ర కూడా కథకు చాలా కీలకమైన పాత్ర. సినిమా ముందుకు వెళ్ళడానికి శ్రీనిధి శెట్టి పాత్ర చాలా ముఖ్యమైనది. కానీ ఈ పాత్ర విషయంపై నెటిజన్లు కొన్ని కామెంట్స్ చేస్తున్నారు. అది ఏంటంటే కేజిఎఫ్ మొదటి పార్ట్ లో మొదట హీరోయిన్ హీరోని ఇష్టపడదు. కానీ చివరిలో హీరోని ప్రేమిస్తుంది. కానీ కేజిఎఫ్-2 లో మాత్రం మొదట కూడా హీరోయిన్ హీరోని ఇష్టపడదు. బలవంతంగా హీరో హీరోయిన్ ని తీసుకొచ్చి ఇంట్లో పెడతాడు.
తర్వాత హీరోయిన్ కి హీరో ప్రేమ అర్థమవుతుంది. దాంతో, “ఫస్ట్ పార్ట్ లో ప్రేమించాను అని చెప్పి, ఇప్పుడు ఏంటి అలా అంటోంది?” అంటూ సోషల్ మీడియాలో ఈ విషయంపై కామెంట్స్ చేస్తున్నారు. ఈ సినిమాలో నటించిన వారికి మాత్రమే కాకుండా దర్శకుడు ప్రశాంత్ నీల్ తో పాటు సినిమాకి పని చేసిన వారికి కూడా చాలా మంచి పేరు వచ్చింది. వీరిలో చాలా మంది కొత్తవారు లేదా ఇప్పుడు కూడా పైకి వస్తున్న వారు కావడం విశేషం. ఈ సినిమాతో వారందరికీ కూడా పాన్ ఇండియన్ రేంజ్ గుర్తింపు వచ్చింది.
End of Article