అమాంతంగా రెమ్యునరేషన్ ని పెంచేసిన ”త్రిష”…! సినిమాకు ఎంత తీసుకుంటున్నారంటే..?

అమాంతంగా రెమ్యునరేషన్ ని పెంచేసిన ”త్రిష”…! సినిమాకు ఎంత తీసుకుంటున్నారంటే..?

by Megha Varna

Ads

త్రిష గురించి కొత్తగా మనం పరిచయం చెయ్యక్కర్లేదు. త్రిష చక్కటి నటి. ఈమె టాలీవుడ్ ప్రేక్షకులకి బాగా కనెక్ట్ అయ్యిపోయింది. తాజాగా త్రిష తమిళ్ సినిమా పొన్నియన్ సెల్వన్ లో నటించింది. ఈ సినిమా కల్కి కృష్ణమూర్తి రాసిన పొన్నియన్ సెల్వన్ నవల ఆధారంగా రూపొందింది.

Video Advertisement

ఆ నవలని సినిమాలాగా తీయాలి అని ఎంతోమంది నటులు, దర్శకులు ఎన్నో సంవత్సరాల నుండి ప్రయత్నిస్తున్నారు.

దర్శకుడు మణిరత్నం కూడా చాలా సంవత్సరాల నుండి ఇది సినిమాలాగా తీయాలి అని అనుకున్నారు. ఇప్పుడు దీన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. అయితే త్రిష ప్రస్తుతం కోలీవుడ్ ఇండస్ట్రీకే పరిమితం అయ్యిపోయింది. దీని మూలంగా ఆమె రెమ్యునరేషన్ ని కూడా పెంచేసింది. ఈమె తాజాగా పొన్నియన్ సెల్వన్ పార్ట్ 1 లో నటించడం వలనే ఈమె డిమాండ్ బాగా పెరిగి పోయింది. అయితే ఇప్పుడు ఈమె కి ఆఫర్స్ బాగా వస్తున్నాయట.

అందుకే ఈమె రెమ్యునరేషన్ ని రెట్టింపు చేసేసిందిట. పొన్నియన్ సెల్వన్ తరవాత ఈ భామ మూడు కోట్ల రూపాయల వరకు రెమ్యునరేషన్ ని అడుగుతోంది. ఇది వరకు అయితే త్రిష ఇంచుమించుగా కోటిన్నర రూపాయలు తీసుకునేది. కానీ ఇప్పుడు పొన్నియన్ సెల్వన్ పార్ట్1లో నటించిన తరవాత నుండి ఏకంగా మూడు కోట్ల రూపాయల వరకు రెమ్యునరేషన్ ని అడుగుతోంది హీరోయిన్ త్రిష. ఈమె కి ఆఫర్స్ వస్తున్నాయి కనుక టాలీవుడ్ లో కూడా ఈమె మళ్ళీ నటిస్తుందేమో చూడాలి.

 


End of Article

You may also like