Ads
మన టాలీవుడ్ లో చాలా మంది హీరోయిన్స్ ఉన్నారు. అందరూ ఎక్కడో ఒక చోట నుండి మొదలు పెట్టారు. ఎవరికైనా ఫస్ట్ ఛాన్స్ అనేది చాలా ముఖ్యమైనది. ఆ ఛాన్స్ ఉపయోగించుకొని మన హీరోయిన్స్ ఇంత స్టేజ్ కి వచ్చారు. మన టాలీవుడ్ లో కొంతమంది హీరోయిన్ కి ఛాన్స్ ఎలా వచ్చిందో ఇప్పుడు చూద్దాం.
Video Advertisement
#1 సాయి పల్లవి
సాయి పల్లవి కస్తూరిమాన్, ధూమ్ దాం సినిమాల్లో నటించారు. కానీ అవి చాలా చిన్న పాత్రలు. 2014 లో జార్జియాలో చదువుకుంటున్నప్పుడు ప్రేమమ్ సినిమా డైరెక్టర్ ఆల్ఫోన్స్ పుతరేన్ సాయి పల్లవిని నటించమని అడగడంతో, ఇంట్లో వాళ్ళని ఒప్పించి హాలిడేస్ సమయంలో షూటింగ్ చేశారు సాయి పల్లవి.
తర్వాత 2015 లో దుల్కర్ సల్మాన్ హీరోగా వచ్చిన కాళీ సినిమాలో నటించారు. 2017 లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఫిదా సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. సినిమాల్లోకి రాకముందు సాయిపల్లవి తెలుగులో ఢీలో, అలాగే తమిళ్ లో ఉంగలీల్ యార్ అడుత్త ప్రభుదేవా అనే ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేశారు.
#2 సమంత
ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువుకునే రోజుల్లోనే పార్ట్ టైం ఉద్యోగం చేయడం మొదలు పెట్టారు సమంత. ఎన్నో పార్ట్ టైం ఉద్యోగాలు చేసిన తర్వాత తన స్నేహితురాలికి తెలిసిన వాళ్ళు అయిన ప్రముఖ ఫోటోగ్రాఫర్ వెంకట్ రామ్ తీసిన ఒక ఫోటో ద్వారా సమంత కి మోడలింగ్ లో అవకాశం వచ్చింది.
అలా మోడలింగ్ తో తన కెరీర్ ను ప్రారంభించారు.నాయుడు హాల్ కి మోడలింగ్ చేస్తున్నప్పుడు సినిమాటోగ్రాఫర్ రవివర్మన్ తను తీయబోయే సినిమా లో హీరోయిన్ గా సమంత ని నటించామన్నారు. అలా సమంత మొదటి సినిమా మాస్కోవిన్ కావేరి లో రాహుల్ రవీంద్రన్ కి జంటగా నటించారు.
#3 రకుల్ ప్రీత్ సింగ్
రకుల్ ప్రీత్ సింగ్ మొదట 7/g బృందావన్ కాలనీ కన్నడ రీమేక్ లో నటించారు. రకుల్ ప్రీత్ మిస్ ఇండియా కాంపిటీషన్ లో కూడా పాల్గొన్నారు. ముందు రకుల్ ప్రీత్ కి అసలు సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి ఏమీ తెలియదు అట. కానీ మొదటి సినిమాకి వచ్చే డబ్బులతో కార్ కొనుక్కోవచ్చు అని అలాగే అసలు ఫిలిం మేకింగ్ అంతా ఎలా ఉంటుందో చూద్దామని సినిమా చేయడానికి అంగీకరించాను అని ఒక ఇంటర్వ్యూలో రకుల్ ప్రీత్ సింగ్ చెప్పారు.
#4 మెహరీన్ పిర్జాదా
మెహరీన్ సినిమాల్లోకి రాకముందు అడ్వర్టైజ్మెంట్స్ లో నటించారు. తమిళ్ లో విశాల్ తో కలిసి థమ్సప్ అడ్వటైజ్మెంట్ లో నటించారు. అలా మోడలింగ్ ద్వారా సినిమాల్లోకి అడుగు పెట్టారు మెహరీన్.
#5 అనుపమ పరమేశ్వరన్
ప్రేమమ్ సినిమాకి ఆడిషన్స్ కి ఫోటోలు పంపించారట అనుపమ. ఈ విషయం తెలిసి వాళ్ళ ఇంట్లో గొడవ అయిందట. తర్వాత అనుపమ ఇంట్లో వాళ్ళని ఒప్పించి సినిమాల్లోకి అడుగు పెట్టారు.
#6 రితికా సింగ్
విక్టరీ వెంకటేష్ హీరోగా సుధ కొంగర దర్శకత్వంలో వచ్చిన గురు సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టారు రితికా సింగ్. అంతకు ముందే ఈ సినిమా మాధవన్ హీరోగా తమిళ్ లో ఇరుది సుట్రు పేరుతో రూపొందింది. ఈ సినిమాకి కూడా సుధ కొంగర దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో రితికా సింగ్ హీరోయిన్ గా నటించారు. రితికా సింగ్ ఒక ప్రొఫెషనల్ బాక్సర్. ఒక మ్యాచ్ లో తనని చూసిన సుధా కొంగర, సినిమా కోసం ఆడిషన్ ఇవ్వమని అడిగారట. అలా రితికా సింగ్ సినిమాల్లోకి అడుగు పెట్టారు.
#7 రాశి ఖన్నా
ఒకసారి కోల్డ్ క్రీమ్ క్యాంపెయిన్ జరుగుతూ ఉంటే, అందులో గెలిచిన వారికి ఫ్రీ కోల్డ్ క్రీం వస్తుంది అనడంతో రాశి పార్టిసిపేట్ చేశారు. అందులో గెలిచిన తర్వాత రాశి ఫోటో మ్యాగజిన్ మీద పడింది. తర్వాత మోడలింగ్ లోకి అడుగుపెట్టారు రాశి. సుజిత్ సర్కార్ దర్శకత్వంలో జాన్ అబ్రహం హీరోగా వచ్చిన మద్రాస్ కేఫ్ తో ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు.
#8 నభా నటేష్
నభా నటేష్ మోడలింగ్ తో పాటు జాతీయ అవార్డ్ విజేత అయిన డైరెక్టర్ ప్రకాష్ బేలవాడి దర్శకత్వంలో ప్లేస్ చేసేవారు. నభా నటేష్ భరతనాట్యంలో కూడా శిక్షణ తీసుకున్నారు. 2017 శివ రాజ్ కుమార్ హీరోగా వచ్చిన కన్నడ చిత్రంతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు.
#9 షాలిని పాండే
అర్జున్ రెడ్డి సినిమాతో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన షాలిని పాండే అంతకు ముందు థియేటర్ ఆర్టిస్ట్. కాలేజీ లో ఉన్నప్పుడే నాటకాల్లో చేయడం మొదలుపెట్టారు. అటు చదువు ఇటు డ్రామా రెండు మేనేజ్ చేసుకునేవారు. షాలిని పాండే సినిమాల్లోకి రావడానికి తన తండ్రిని చాలా కన్విన్స్ చేయాల్సి వచ్చిందట. ముంబైకి వెళ్లి తర్వాత తాను యాక్ట్రెస్ అవుతాను అని తన తండ్రికి ఒక మెయిల్ పెట్టారట షాలిని.
తర్వాత తన పోర్ట్‌ఫోలియో చూసిన సందీప్ రెడ్డి వంగా అర్జున్ రెడ్డి సినిమా కోసం షాలినిని సంప్రదించారు. అర్జున్ రెడ్డి సినిమాకి ముందు అసలు సౌత్ ఇండస్ట్రీ గురించి షాలిని కి పూర్తిగా తెలియదట. కేవలం హిందీ ఛానల్స్ లో వేసే డబ్బింగ్ సినిమాలు మాత్రమే చూశారు అని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.
End of Article