Ads
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంచి దర్శకుడుగా గుర్తింపు తెచ్చుకున్న పూరీ జగన్నాథ్ గత కొద్ది కాలంగా మంచి సక్సెస్ లేక ఇబ్బంది పడుతున్నారు. చాలా రోజుల తర్వాత రామ్ హీరోగా ఇస్మార్ట్ శంకర్ మూవీతో మంచి సక్సెస్ను అందుకున్న పూరీకి ఆ తర్వాత పెద్దగా హిట్లు లేవని చెప్పవచ్చు. వినూత్నమైన కాన్సెప్ట్ తో మంచి మాస్ యాంగిల్ లో రామ్ ని సరికొత్తగా చూపించిన మూవీ ఇస్మార్ట్ శంకర్.
Video Advertisement
ఈ మూవీ రామ్ కి కూడా మంచి కెరియర్ బ్రేక్ ఇచ్చిందని చెప్పవచ్చు. ఈ సినిమా తర్వాత ఫామ్ లోకి వచ్చిన రామ్ తర్వాత అనుకున్న రేంజ్ సక్సెస్ లను అందుకోలేకపోయాడు. ఈ సినిమాతో హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న నిధి అగర్వాల్ ఆ తర్వాత మంచి సక్సెస్ అందుకోలేకపోయింది. ఒకే సినిమాతో సక్సెస్ అందుకున్న హీరో హీరోయిన్ మరియు డైరెక్టర్ ఆ తర్వాత పెద్దగా అవకాశాలు లేకపోవడం విశేషం.
ఈ నేపథ్యంలో డబల్ ఇస్మార్ట్ శంకర్ అని ఇస్మార్ట్ శంకర్ మూవీకి సీక్వెల్ ని తీయబోతున్న పూరి జగన్నాథ్ హీరోయిన్లకు అన్యాయం చేస్తున్నారని కొందరు భావిస్తున్నారు. ఈ సినిమాలో మొదట నటించిన హీరో హీరోయిన్ ని కాదని బాలీవుడ్ హీరోయిన్ ని తీసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. నిధి అగర్వాల్, నభానటేష్ ను పక్కన పెట్టి ఈసారి మూవీ లో సారా అలీ ఖాన్, శ్రద్ధ కపూర్ ను తీసుకోవాలనుకుంటున్నట్లు తెలుస్తోంది.
ఏకంగా ఈసారి పూరి ఈ సినిమాని పాన్ ఇండియన్ స్థాయిలో రూపొందించబోతున్నట్లు తెలుస్తోంది. అందుకే బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా డిమాండ్ పెంచుకోవడం కోసం అక్కడ స్టార్ హీరోయిన్లకే అతని ఓటు వేస్తున్నాడు. ఈ విషయానికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో విడుదల కానున్నట్లు తెలుస్తోంది.
End of Article