తమ భర్తతో/ప్రేమించిన వ్యక్తితో విడిపోయాక… “నెగిటివ్ కామెంట్స్” ఎదుర్కొన్న 7 హీరోయిన్స్..!

తమ భర్తతో/ప్రేమించిన వ్యక్తితో విడిపోయాక… “నెగిటివ్ కామెంట్స్” ఎదుర్కొన్న 7 హీరోయిన్స్..!

by kavitha

Ads

పెళ్లి చేసుకున్నప్పుడు హర్షించే సొసైటీ, ఆ జంట విడాకులు తీసుకుని విడిపోయినపుడు మాత్రం దాన్ని ఆమోదించలేదు. ముఖ్యంగా విడాకులు తీసుకున్నది ఇద్దరు అయినా, సమాజం స్త్రీని ఎక్కువగా నిందిస్తుంది, విమర్శిస్తుంది.

Video Advertisement

దీనికి సినీ సెలెబ్రెటీలు కూడా అతీతులు కారు. సెలబ్రిటీ జంటలు విడిపోయినపుడు మహిళలనే విమర్శించడం, ట్రోల్ చేయడం జరిగింది. అలా విడిపోయి, ట్రోల్ అయిన 7 గురు హీరోయిన్ల గురించి ఇప్పుడు చూద్దాం..
Women-Were-Blamed-For-Their-Divorces 1. సమంత:

సమంత, నాగ చైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత సోషల్ మీడియాలో సమంత పై చాలా మంది రకరకాల కామెంట్లు చేశారు. నాగ చైతన్య నుండి భారీగా భరణం తీసుకుందని ట్రోల్ చేశారు.2. కుషా కపిల:

కుషా కపిల, జొరావర్‌ సిగ్‌ అహ్లువాలియా మూడు రోజుల క్రితం తాము విడిపోతున్నట్లుగా ప్రకటించారు. ఇది ఇద్దరు  కలిసి తీసుకున్న నిర్ణయం అయినప్పటికీ ఫ్యాన్స్ కు నచ్చలేదు. దాంతో కుషా కపిలను తీవ్రంగా విమర్శిస్తున్నారు. కొందరు నెటిజన్లు ఆమె క్యారెక్టర్‌ పై అసభ్య రీతిలో కామెంట్లు చేస్తున్నారు.
3. మలైకా అరోరా:

మలైకా అరోరా అర్బాజ్ ఖాన్‌తో విడాకులు తీసుకున్న తర్వాత, జాబ్ కోసం మాజీ భర్త ఫ్యామిలీ పేరును వాడుకున్నందుకు నెటిజెన్లు మలైకాను ట్రోల్ చేశారు. విడాకులు తరువాత భరణం విషయంలో ఆమె ట్రోలింగ్ కు గురి అయ్యింది. మలైకా, అర్జున్ కపూర్‌తో డేటింగ్ విషయంలో కూడా ఆమెను ట్రోల్ చేశారు.
4. వనితా విజయ్ కుమార్:

సీనియర్ నటుడు ‌విజయ్‌కుమార్‌, మంజుల పెద్ద కూతురు వనిత విజయ్‌కుమార్‌. సినిమాలలో రాణించలేకపోయిన ఆమె ప్రేమ,పెళ్ళిళ్ళతో బాగా పాపులర్‌ అయ్యింది. వనిత ఇప్పటికే మూడు పెళ్ళిళ్లు చేసుకుని, ముగ్గురికి విడాకులు ఇచ్చింది. దీంతో వివాదాస్పద నటిగా నిలిచింది. పెళ్ళిళ్ళ సమయంలో, విడాకుల సమయంలో విపరీతంగా విమర్శలకు గురి అయ్యింది.
5. నయనతార :

నయనతార వల్ల ప్రభుదేవా మరియు వాళ్ల భార్య కి గొడవలు వచ్చాయి. అందరు ఆమెని మాత్రమే తిట్టారు. కానీ ఆ తర్వాత వాళ్ళు విడిపోయారు. అప్పుడు కూడా నయనతారను బయట చాలా అవమానకరంగా మాట్లాడారు. అప్పటి నుండి నయనతార ప్రమోషన్స్ కు రావడం మానేసింది. ఈ విషయంలో ప్రభుదేవా కన్నా నయనతారనే ఎక్కువ అవమానాలు ఎదుర్కొంది.
6. రష్మిక మందన్న:

2016లో రష్మిక మందన్న కిరాక్ పార్టీ అనే కన్నడ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. 2017లో రష్మిక కిరాక్ పార్టీ హీరో రక్షిత్ శెట్టితో ఎంగేజ్‌మెంట్‌ చేసుకుంది. అయితే కొన్ని రోజులకే ఇద్దరూ ఎంగేజ్‌మెంట్‌ను క్యాన్సల్ చేసుకుని విడిపోయారు. వారు విడిపోయిన తరువాత నెటిజెన్లు రష్మికను విపరీతంగా ట్రోల్ చేశారు.
7. అమలా పాల్:

అమలాపాల్ ప్రొడ్యూసర్ ఏఎల్ విజయ్ ను 2014లో పెళ్లి చేసుకున్నారు. కానీ ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట 2017లో విడాకులు తీసుకుని విడిపోయారు. ఆ సమయంలో అమలాపాల్ పై విమర్శలు గుప్పించారు.

Also Read: “నిజాలు రాయండి..!” అంటూ… “శేఖర్ మాస్టర్” కామెంట్స్..! ఏం జరిగిందంటే..?


End of Article

You may also like