“నిజాలు రాయండి..!” అంటూ… “శేఖర్ మాస్టర్” కామెంట్స్..! ఏం జరిగిందంటే..?

“నిజాలు రాయండి..!” అంటూ… “శేఖర్ మాస్టర్” కామెంట్స్..! ఏం జరిగిందంటే..?

by kavitha

Ads

ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ రీసెంట్ గా అనారోగ్యంతో కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆయన పెద్ద కర్మను బుధవారం (జూన్ 28) నాడు రాకేష్ మాస్టర్ శిష్యులు అయిన శేఖర్ మాస్టర్ మరియు సత్య మాస్టర్  హైదరాబాద్‏లో నిర్వహించారు. ఈ కార్యక్రమనికి డైరెక్టర్ వై వియస్ చౌదరి హాజరయ్యారు.

Video Advertisement

ఈ సందర్భంగా శేఖర్ మాస్టర్ మాట్లాడుతూ గురువుతో తనకున్న అనుబంధాన్ని జ్ఞాపకం చేసుకుని, ఎమోషనల్ అయ్యాడు. ఈ క్రమంలో తన పై వస్తున్న వార్తల పై, విమర్శల గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. rakesh-master-pedda-karma-1“రాకేష్ మాస్టర్ తో 8 ఏళ్ళు  ప్రయాణించానని, ఆ సమయంలో బయట ప్రపంచం ఎలా ఉంటుందో మాకు తెలియదు. తాను, సత్య మాస్టర్ ఇద్దరు విజయవాడలో డ్యాన్స్ నేర్చుకున్న అనంతరం రాకేష్ మాస్టర్ వద్దకు వచ్చాము. రాకేష్ మాస్టర్ గొప్ప డ్యాన్సర్. యూట్యూబ్‌లో చూస్తున్న రాకేష్ మాస్టర్ డ్యాన్స్ ఐదు పర్సంటే అని, ఈ విషయం చాలా మందికి తెలియదని అన్నారు. చిన్నప్పటి నుండి నాకు వ్యక్తిగతంగా ప్రభుదేవా అంటే చాలా ఇష్టం. అయితే హైదరాబాద్ వచ్చిన తరువాత రాకేష్ మాస్టర్ డ్యాన్స్ చూసి అభిమానించడం మొదలుపెట్టాను.గతంలో ఆయన చాలా బాగా డ్యాన్స్ చేసేవారు. రాకేష్ మాస్టర్ ను గురువు అని చెప్పుకోవడం గర్వంగా ఉందని అన్నారు. ఇక డ్యాన్స్ ప్రాక్టీస్ చేసేటప్పుడు ఫర్ ఫెక్ట్ గా వచ్చే వరకు వదిలిపెట్టేవారు వారు కాదని చెప్పారు. మాస్టర్ ఎక్కడున్నా కూడా బాగుండాలని అనుకున్నాం. ఇలా అవుతుందని అసలు అనుకోలేదని అన్నారు. రాకేష్ మాస్టర్ పెళ్లి చేసింది మేమే. రాకేష్ మాస్టర్ తప్ప వేరే ప్రపంచం మాకు తెలియదు. మాస్టర్ తోనే ఉండి, ఆయన ఇన్ స్టిట్యూట్ లో క్లాసులు చెప్పవాళ్ళం, అక్కడే బతికాము.rakesh-masterఆ తర్వాత మాస్టర్ దర్శకుడిగా ప్రయత్నాలు మొదలు పెట్టినపుడు ఏం చేయాలో తెలియక అక్కడి నుండి బయటకు వచ్చి మాస్టర్లుగా అయ్యాము. కొన్ని యూట్యూబ్ ఛానల్స్, వారికి తోచిన థంబ్ నెయిల్స్ పెట్టి, ఏమేమో చెప్తున్నారు. అలా చేయడం వల్ల వేరేవారి కుటుంబాలు బాధపడుతున్నాయి. ఏ విషయం అయినా నిజాలు మాత్రమే రాయండని అన్నారు. మా రాకేశ్ మాస్టర్ ఎక్కడున్నా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా” అని పేర్కొన్నారు.

Also Read: SPY REVIEW : “నిఖిల్” కి మరొక హిట్ పడినట్టేనా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!


End of Article

You may also like