Ads
చాలా రోజులు వెయిట్ చేసిన తర్వాత భీమ్లా నాయక్ థియేటర్లలో విడుదల అయ్యింది. ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సి ఉన్నా కూడా అప్పుడు ఉన్న పరిస్థితుల కారణంగా ఆలస్యం అయ్యింది.
Video Advertisement
సినిమా రీమేక్ అనే విషయం తెలిసిందే. కానీ పవన్ కళ్యాణ్ నటిస్తూ ఉండటంతో, అది కూడా రానా దగ్గుబాటితో మల్టీస్టారర్ అవ్వడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా నెలకొన్నాయి.
అంతే కాకుండా సినిమాకి సంబంధించి కొన్ని మార్పులు జరిగాయి. ఆ మార్పులు కూడా వర్కవుట్ అయ్యాయి. మన నేటివిటీకి తగ్గట్టు చేసిన ఆ మార్పులు ప్రేక్షకులకు చాలా బాగా నచ్చాయి. ఒరిజినల్ సినిమా కంటే తెలుగు సినిమా దాదాపు 30 నిమిషాల నిడివి తక్కువ ఉంటుంది. వీటన్నిటి వల్ల సినిమా క్రేజ్ ఇంకా పెరగడంతో ప్రస్తుతం సూపర్ హిట్ టాక్ తో థియేటర్లలో దూసుకుపోతోంది. మళ్లీ గబ్బర్ సింగ్ తర్వాత పవన్ కళ్యాణ్ కి ఈ సినిమాతో అంత పెద్ద హిట్ పడింది అని అంటున్నారు.
ఈ సినిమాలో హీరోయిన్స్‌గా నిత్యా మీనన్, సంయుక్త మీనన్ నటించారు. వీరికి కూడా మంచి పేరు వచ్చింది. కానీ ఈ పాత్రలకి మొదట అనుకున్న హీరోయిన్లు వీరు కాదు. నిత్యా మీనన్ పాత్ర కోసం మొదట సాయి పల్లవిని అనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల సాయి పల్లవి ఈ పాత్రని తిరస్కరించారు. ఇంక సంయుక్త మీనన్ పాత్ర కోసం మొదట ఐశ్వర్య రాజేష్ ని అనుకున్నారు. ఐశ్వర్య రాజేష్ ఈ సినిమాలో నటిస్తున్నట్టు అధికారకంగా ప్రకటించారు. కానీ తర్వాత కొన్ని కారణాల వల్ల ఐశ్వర్య రాజేష్ ఈ సినిమా నుండి తప్పుకున్నారు. దాంతో వారి స్థానాల్లో వీళ్ళిద్దరూ హీరోయిన్స్ గా నటించారు.
End of Article