Ads
ఎన్నో రోజులు వెయిట్ చేసిన తర్వాత కేజీఎఫ్ చాప్టర్-2 విడుదల అయ్యింది. కేజీఎఫ్ మొదటి భాగం ఎవరూ ఊహించనంత పెద్ద హిట్ అయ్యింది. మొదటి భాగం మొత్తంలో కూడా రాకీ భాయ్ ఎలా ఎదిగాడు అనేది చూపించారు. రెండవ భాగంలో మాత్రం రాకీ భాయ్ ఎదిగిన తర్వాత తాను ఎదుర్కొన్న సమస్యలు ఏంటి అనేది చూపించారు? మొదటి భాగంలాగానే ఈ సినిమా కూడా పవర్ ఫుల్ గా ఉంటుంది.
Video Advertisement
అసలు రాకీ భాయ్ ని జనాలు అందరూ అంత గుర్తు పెట్టుకునే అంతగా ఏం చేసాడు అనేది ఈ సినిమాలో చూపించారు. కానీ మొదటి భాగంతో పోలిస్తే ఈ సినిమాలో ఎమోషన్స్ కొంచెం తక్కువగా ఉన్నట్టు అనిపిస్తాయి. అలాగే విలన్ పాత్ర కూడా మనం చాలా సినిమాల్లో చూసినట్టే అనిపిస్తుంది. కానీ యాక్షన్ సీన్స్ మాత్రం చాలా బాగా డిజైన్ చేశారు.
అయితే సినిమాలో ఒక సీన్ ఉంది. అందులో హీరో చిన్నప్పుడు సముద్రం దగ్గర నిల్చుని చూస్తూ ఉంటాడు. పెద్దయిన తర్వాత కూడా సముద్రం దగ్గర నుంచొని చూస్తూ ఉంటాడు. దాని వెనకాల ఏం అర్థం ఉంది అని ప్రేక్షకులు అప్పుడు ఆలోచించరు. కానీ ఈ సీన్ వెనకాల కూడా దర్శకుడు ప్రశాంత్ ని ఒక పెద్ద అర్థం ఉండేలాగా డిజైన్ చేశారు. సినిమాలో హీరో బంగారం మొత్తాన్ని ఒక షిప్ లో పెట్టి దాన్ని సముద్రంలోకి తీసుకెళ్ళి పడేస్తాడు.
సినిమాలో చాలా సార్లు హీరో సముద్రం వైపు చూస్తూ ఉన్నప్పుడు మన ఎవరికీ అర్థం అవ్వదు. కానీ దీని వెనకాల ఇంత పెద్ద అర్థం ఉండేలాగా ప్రశాంత్ నీల్ లైన్ రాసుకున్నారు. ఈ ఒక్కటి మాత్రమే కాదు సినిమాలో ఉండే చాలా చిన్న చిన్న విషయాల వెనుక కూడా పెద్ద అర్థం ఉంది. అవన్నీ మనకి సినిమా ముందుకు వెళ్లే కొద్దీ అర్థం అవుతుంది. సినిమా చివరిలో కూడా ఒక ట్విస్ట్ ఇచ్చారు. మరి నిజం గానే నెక్స్ట్ పార్ట్ ఉందా? ఉంటే అందులో ఎం ఉండబోతోంది? వీటి గురించి ప్రస్తుతానికి ఎలాంటి వార్తలు రాలేదు.
End of Article