Ads
పెళ్లి అయిన తరువాత భార్య ఖాళీగా ఇంట్లో ఉండకూడదని, భర్త సంపాదన అనేది మెయింటెనెన్స్ మాత్రమే అని హైకోర్టు ఒక కేసు విషయంలో వెల్లడించింది. వివాహానికి ముందు జాబ్ చేసిన భార్య వివాహం అయిన తరువాత ఖాళీగా ఉండకూడదని, ఉద్యోగం చేయాలని కోర్టు తీర్పు ఇచ్చింది.
Video Advertisement
భార్య ఖాళీగా ఇంట్లో కూర్చుని భర్త నుండి పూర్తి మెయింటెనెన్స్ కోసం డబ్బులు అడగకూడదని ఇటీవల హైకోర్టు తన తీర్పును వెల్లడించింది. ఈ సంఘటన ఎక్కడ జరిగిందో పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
కర్ణాటకలోని బెంగళూరు అర్బన్ జిల్లాకు చెందిన ఒక మహిళ భర్త నుండి డైవర్స్ తీసుకుంది. అయితే తనకు వస్తున్న భరణంలో కోత పెట్టారని ఆ మహిళా పిటిషన్ వేసింది. ఇటీవల ఈ పిటిషన్ ను కర్ణాటక న్యాయమూర్తి అయిన రాజేంద్ర విచారించారు. ఈ క్రమంలో తీర్పు చెబుతూ, గతంలో జాబ్ చేసిన భార్యలు ఖాళీగా ఇంట్లో ఉండకూడదని, భర్త ఇచ్చే భరణం పైనే పూర్తిగా ఆధారపడకుండా ఆ మహిళ ఏదైనా జాబ్ చేసుకుంటూ బతకాలని కర్ణాటక హైకోర్టు సూచించింది.
సదరు మహిళ పిటిషన్ ను విచారించిన జడ్జి, మాజీ భర్త ఎందుకు తనకు అదనంగా భరణం ఇవ్వాలని అడిగిన ప్రశ్నకు ఆ మహిళ సరైన సమాధానం చెప్పలేదు. భరణం అందుకోవడానికి ఆమె ఉన్న అవసరాలు ఏమిటో చెప్పాలని అడిగింది. వివాహనికి ముందు జాబ్ చేసావు మరి పెళ్లి అయిన తరువాత ఎందుకు జాబ్ చేయలేక పోయావని కోర్టు ప్రశ్నించింది. కానీ సదరు మహిళ ఏం సమాధానం చెప్పలేకపోయింది. పెళ్ళికి ముందు జాబ్ చేసిన మహిళ వివాహం తర్వాత జాబ్ మానేసి పూర్తిగా భర్త సంపాదన పైనే ఆధారపడింది. భార్య లీగల్ గా బ్రతుకు దెరువు కోసం ఏదైనా ఉద్యోగం చేయాలని, భర్త నుండి కేవలం సపోర్టివ్ మెయింటెనెన్స్ తీసుకోవాలని కర్ణాటక హైకోర్టు వెల్లడించింది.
Also Read: భర్తతో విడాకులు… యజమానితో ప్రేమ పెళ్లి..! ఈ యువత గురించి తెలిస్తే కన్నీళ్లు ఆగవు..!
End of Article