Ads
రాధే శ్యామ్ సినిమా కోసం ప్రేక్షకులందరూ దాదాపు 2 సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్నారు. సాహో తర్వాత ప్రభాస్ లవ్ స్టోరీ చేస్తున్నారు అంటే ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. సినిమాకి సంబంధించిన పోస్టర్స్, వీడియోలు కూడా ఈ ఆసక్తి పెరగడానికి ఇంకా కారణం అయ్యాయి. సినిమాలో సెట్టింగ్స్ చాలా బాగున్నాయి.
Video Advertisement
అప్పటి సమయంలో ఇటలీ ఎలా ఉంటుందో అలాగే చూపించారు. ప్రభాస్, పూజా హెగ్డే వేర్వేరుగా చాలా బాగా నటించారు అనిపిస్తుంది. వాళ్ల కాస్ట్యూమ్స్, గెటప్స్ కూడా చాలా బాగున్నాయి. కానీ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ అంత వర్కవుట్ అవ్వలేదు అనిపిస్తుంది. వారిద్దరినీ చూస్తున్నంత సేపు ఒక లవ్ స్టోరీలో హీరో హీరోయిన్ల మధ్య ఉండాల్సిన అంత కెమిస్ట్రీ లేదేమో అనిపిస్తుంది. అయితే, సినిమాకి ప్లస్ పాయింట్స్ కూడా కొన్ని ఉన్నాయి. అవి సినిమా సూపర్ హిట్ టాక్ రావడానికి కారణం అయ్యాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.
#1 ఈ సినిమాకి మెయిన్ హైలెట్ ట్రైన్ సీన్స్. చుట్టూ ఉన్న పరిసరాలు అంతా చూస్తూ ఉంటే ఒరిజినల్ లొకేషన్స్ లాగానే అనిపిస్తాయి.
#2 అలాగే డైరీ సీన్ కూడా చాలా బాగా వచ్చింది. అందులో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హైలైట్ గా నిలిచింది.
#3 అసలు సినిమాకి ఒక మెయిన్ హైలెట్ తమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్. ఒక లవ్ స్టోరీకి ఎలాంటి మ్యూజిక్ ఉండాలో సరిగ్గా అలాంటి మ్యూజిక్ అందించారు తమన్.
#4 అలాగే షిప్ సీన్ కూడా నుండి ఒక హైలైట్ గా నిలిచింది. గ్రాఫిక్స్ అయితే హాలీవుడ్ రేంజ్ లో ఉన్నాయి.
#5 అలాగే క్లైమాక్స్ కూడా ఈ సినిమాకి ప్రధాన బలం. ఈ సీన్ లో ప్రభాస్ చాలా బాగా నటించారు.
అసలు నిజంగా ఇలాంటి ఫైట్స్ లేని సినిమా చేయడానికి, అది కూడా ఒక పాన్ ఇండియన్ రేంజ్ సినిమా చేయడానికి ఒక హీరోకి ధైర్యం కావాలి. అలాంటి ధైర్యం ప్రభాస్ కి ఉంది అంటూ అందరూ పొగుడుతున్నారు.
End of Article