Ads
ఆర్ఆర్ఆర్ సినిమా ఎప్పుడెప్పుడు థియేటర్లలో విడుదల అవుతుందా అని మన రెండు తెలుగు రాష్ట్రాలు మాత్రమే కాదు భారతదేశం అంతా కూడా ఎదురు చూసింది. అందుకు మొదటి కారణం రాజమౌళి అయితే రెండో కారణం ఇద్దరు స్టార్ హీరోలు ఒకే తెరపై కనిపించడం. రాజమౌళి వారిద్దరిని కలిపి చూపించాలి అన్న ఆలోచనని ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారు?
Video Advertisement
వారిద్దరిలో ఒకరికి ప్రాముఖ్యత పెరిగి మరొకరికి ప్రాముఖ్యత తగ్గుతుందా? ఇలాంటి ప్రశ్నలు చాలా నెలకొన్నాయి? కానీ సినిమా ట్రైలర్ చూసిన తర్వాత ఇద్దరికీ సమానంగా ప్రాముఖ్యత ఉంటుంది అని అర్ధమైపోయింది. సినిమాలో ఇద్దరికీ సమానమైన పాత్రలు ఉంటాయి. సినిమాలో కొన్ని సీన్స్ మాత్రం హైలైట్ గా నిలిచాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.
#1 హీరోలు ఇద్దరి ఇంట్రడక్షన్ సీన్స్. ఒకరిని నిప్పుతో, మరొకరిని నీటితో బ్యాక్ గ్రౌండ్ లో పెట్టి వారి పాత్రలని ఇంట్రడ్యూస్ చేశారు.
#2 నాటు నాటు పాట. మనకి లిరికల్ వీడియోలో చూసిన దానికంటే ఈ సినిమాలో చూసిన పాట చాలా బాగా అనిపిస్తుంది. ముఖ్యంగా ఇద్దరు హీరోలు కలిసి స్టెప్స్ వేయడం ఒక హైలైట్ అయ్యింది.
#3 సెకండ్ హాఫ్ లో వచ్చే కొన్ని సీన్స్ అయితే చాలా ఎమోషనల్ గా ఉన్నాయి. సినిమాకి ప్రాణం లాంటి సీన్స్ అవే.
#4 ఇద్దరు హీరోల పాత్రల మధ్య స్నేహం కూడా చాలా బాగా చూపించారు. సినిమా చూస్తున్నంత సేపు వారు ఇద్దరు స్టార్ హీరోలు అనే విషయం మనకు గుర్తుకు రాదు. కేవలం వారి పాత్రలు మాత్రమే మనకి కనిపిస్తారు.
#5 ఇంటర్వెల్ అయితే సినిమాని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళింది. సెకండ్ హాఫ్ ఏమవుతుందో అనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది.
#6 క్లైమాక్స్ కూడా సినిమాకి మరో హైలైట్. కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజు మధ్య స్నేహాన్ని ఆ సీన్ లో ఇంకా బాగా చూపించారు.
సినిమాలో ఇవే కాకుండా ఇంకా చాలా హైలైట్ అయిన విషయాలు ఉన్నాయి. ప్రేక్షకుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఉంటుంది సినిమా. దాంతో ప్రేక్షకులు అందరూ సినిమా బృందాన్ని ప్రశంసిస్తున్నారు.
End of Article