Ads
పరిశ్రమలల్లో ప్రమాదాలు జరగడం , వెంటనే ప్రభుత్వాలు హడావిడి చేయడం , ప్రజలు పరిశ్రమని తొలగించాలని ఆందోళన చేయడం, కొద్ది రోజులకి ఆ గొడవ సద్దుమనగడం సహజం.. వైజాగ్ ఎల్జీ పాలిమర్స్ లో మే 7న జరిగిన ఘటన తొలిసారి కాదు.. 1998లో ఒకసారి ప్రమాదం సంభవించింది..అప్పుడే పరిశ్రమని తరలించాలని ఆందోళన చేసారు స్థానికులు , అయినప్పటికి అది సాధ్యపడలేదు. ఇంతకీ ఈ కంపెనీ ఎప్పుడు స్థాపించారు..ఇందులో ఏం తయారవుతాయి..?
Video Advertisement
1961లో హిందుస్తాన్ పాలిమర్స్:
హిందుస్తాన్ పాలిమర్స్ పేరుతో 1961లో ఈ కంపెనీని ప్రారంభించారు. మొదట్లో దీంట్లో మొలాసిస్(చెరకు నుండి చక్కెర తయారిలో ఉపఉత్పత్తి) నుండి ఆల్కహాల్ తయారికి అవసరమైన ఇథనాల్ ను తయారు చేసేవారు.. కాని చుట్టుపక్కల దుర్గందం రావడంతో స్థానికులు వ్యతిరేకించారు . దాంతో కొంతకాలం కంపెనిని మూసేసారు.తర్వాత విదేశాలనుండి స్టైరీన్ ని దిగుమతి చేసుకుని పాలిస్టైరీన్ ని తయారు చేసేవాళ్లు.. 1978లో దీనిని యూబీ(యూనైటెడ్ బ్రూవరీస్) గ్రూప్ కి చెందిన మెక్ డోవల్స్ కంపెని తీసుకుంది.
మనదేశానికి 1990లో వచ్చిన ఎల్జీ:
మన దేశంలో ఎల్జీ బ్రాండ్ తెలియని వారుండరు.. మనదేశానికి 1990లో వచ్చిన ఎల్జీ, మొదట విదేశాల నుండి దిగుమతి చేసుకున్న వస్తువులను విక్రయించేది. స్వయంగా తానే వస్తువులను రూపొందించాలనే ఉద్దేశ్యంతో, పాలిమర్స్ తయారి యూనిట్ అవసరమై మెక్ డోవల్స్ నుండి 1997 జులైలో దక్షిణకొరియాకు చెందిన ఎల్‌జీ గ్రూప్ (ఎల్‌జీ కెమికల్స్) తీసుకుని “ఎల్‌జీ పాలిమర్స్”గా అవతరించింది. పిఎస్(పాలీస్టైరీన్), ఈపిఎస్(ఎక్స్సాండబుల్ పాలిస్టైరీన్) వస్తువులను ఈ సంస్థలో తయారు చేస్తారు.
స్టైరీన్ ని ఎక్కడ ఉపయోగిస్తారు?
స్టైరీన్ ని పొలిమెరికరణం చెందించి పాలిస్టైరీన్ గా మారుస్తారు..దీనిని పివిసి పైపులు,ఎయిర్ కండిషనర్స్, టివిలు, రిఫ్రిజిరేటర్లు వాటిల్లో వాడతారు. ఎక్సాండబుల్ పాలిస్టైరీన్ ని డిస్పొజబుల్ గ్లాసులు, ప్లేట్లు, గిన్నెలు, ధర్మాకోల్ తయారిలో, పిఎస్ వస్తువులు అనగా ఎలక్ట్రానిక్ వస్తువుల ప్యాకింగ్ కొరకు ఇపిఎస్ వస్తువులను వాడతారు. పాపం,లాక్ డౌన్ లో షాపులు లేక ప్రజలు అత్యవసర వస్తువులు అయినటువంటి ఫ్రిజ్లు, వాషింగ్ మెషీన్లు , ఎసిలు లేక ఇబ్బంది పడ్తున్నారని ఓపెన్ చేయించినట్టునారు..
source: eenadu
End of Article