అప్పుడు “హిట్”…టైటిల్ రిపీట్ చేసేసరికి “ఫట్” అయిన 12 సినిమాలు.! లిస్ట్ ఓ లుక్ వేయండి.!

అప్పుడు “హిట్”…టైటిల్ రిపీట్ చేసేసరికి “ఫట్” అయిన 12 సినిమాలు.! లిస్ట్ ఓ లుక్ వేయండి.!

by Mohana Priya

Ads

సినిమా జనాలకి ఎక్కువగా రీచ్ అవ్వాలి అంటే టైటిల్ అనేది చాలా ముఖ్యం. ఒక సినిమా పేరు ఎంత క్యాచీగా ఉంటే ప్రేక్షకుల దృష్టిలో అంత ఈజీగా పడుతుంది. అందుకే సినిమా టైటిల్స్ చాలా డిఫరెంట్ గా ఉండేలా చూసుకుంటారు. అలాగే టైటిల్ సినిమా కథకు తగ్గట్టు ఉండడం కూడా ఎంతో ముఖ్యం.

Video Advertisement

కొన్ని హిట్ అయిన సినిమా పేర్లు మళ్ళీ తర్వాత వేరే సినిమాలకి రిపీట్ అయ్యాయి. కానీ అవి ముందు సినిమా అంత విజయం సాధించలేదు. అలా హిట్ టైటిల్స్ రిపీట్ అయ్యి, ఆశించిన ఫలితాన్ని ఇవ్వని సినిమాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

#1 జంబలకడిపంబ

ఇ.వి.వి.సత్యనారాయణ గారి దర్శకత్వంలో వచ్చిన సూపర్ హిట్ సినిమా జంబలకడిపంబ. శ్రీనివాస్ రెడ్డి హీరోగా అదే పేరుతో సినిమా విడుదలైంది.

#2 అంతం

రాం గోపాల్ వర్మ డైరెక్షన్ లో కింగ్ నాగార్జున హీరోగా వచ్చిన సినిమా అంతం. తర్వాత 2016 లో రష్మీ హీరోయిన్ గా నటించిన సినిమా పేరు కూడా అంతం.

#3 విజేత

చిరంజీవి హీరోగా నటించిన సినిమా విజేత. 2018 లో కళ్యాణ్ దేవ్ హీరోగా నటించిన మొదటి సినిమా పేరు విజేత.

#4 మరో చరిత్ర

కమల్ హాసన్ నటించిన ట్రెండ్ సెట్టర్ మరో చరిత్ర. అదే పేరుతో వరుణ్ సందేశ్ హీరోగా మరో సినిమా వచ్చింది.

#5 అడవి రాముడు

నందమూరి తారక రామారావు గారి సినిమా అడవి రాముడు. తర్వాత 2004 లో ప్రభాస్ హీరోగా వచ్చిన సినిమా పేరు అడవి రాముడు.

#6 దేవుడు చేసిన మనుషులు

1973 లో వచ్చిన సినిమా దేవుడు చేసిన మనుషులు. తర్వాత రవితేజ, పూరిజగన్నాథ్ కాంబినేషన్ లో ఇదే పేరుతో సినిమా విడుదలైంది.

#7 నిరీక్షణ

భానుచందర్, అర్చన హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా నిరీక్షణ. తర్వాత ఆర్యన్ రాజేష్ హీరోగా ఇదే పేరుతో సినిమా వచ్చింది.

#8 శివ

రాం గోపాల్ వర్మ, కింగ్ నాగార్జున కాంబినేషన్ లో వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమా శివ. తర్వాత రాం గోపాల్ వర్మ డైరెక్షన్ లోనే శివ పేరుతో మరో సినిమా వచ్చింది.

#9 సుందరకాండ

విక్టరీ వెంకటేష్ హీరోగా వచ్చిన సినిమా సుందరకాండ. తర్వాత బాపు గారి దర్శకత్వంలో అల్లరి నరేష్, చార్మి హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా పేరు సుందరకాండ.

#10 మాయాబజార్

1957 లో వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమా మాయాబజార్. రాజా, భూమిక హీరో హీరోయిన్లుగా, ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో ఇదే పేరుతో సినిమా వచ్చింది.

#11 బందిపోటు

1963 లో విఠలాచార్య గారి దర్శకత్వంలో, నందమూరి తారక రామారావు గారు హీరోగా నటించిన సినిమా బందిపోటు. ఇదే పేరుతో అల్లరి నరేష్, ఈషా రెబ్బ హీరో హీరోయిన్లుగా 2015 లో సినిమా విడుదలైంది.

#12 అన్వేషణ

1985 లో వచ్చిన సినిమా అన్వేషణ. 2002 లో రవితేజ హీరోగా ఇదే పేరుతో సినిమా వచ్చింది.


End of Article

You may also like