మన దేశంలో చిన్న-పెద్ద , ఆడ- మగ, కుల-మత బేధాలు లేకుండా అందరూ కలిసి జరుపుకునే పండుగ హోలీ. హోలీ రోజున ఒకరిపైన ఒకరు రకరకాల రంగులు చల్లుకుంటూ ఎంజాయ్ చేస్తుంటారు .దేశవ్యాప్తంగా ఉల్లాసంగా ఉత్సాహంగా జరుపుకునే హోలి పండుగలో రంగులు చల్లుకోవడం మాత్రమే కామన్. కానీ, హోలీ నాడు ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా వేడుకలు జరుపుకుంటారు.  బర్సానాలో అయితే కర్రలతో కొట్టుకుంటారు. ఇదెక్కడి వింత సంప్రదాయం అని ఆశ్చర్యపోతున్నారా? అసలింతకీ ఈ కర్రలతో కొట్టుకోవడం ఏంటి?  తెలుసుకోండి.

కృష్ణుడి జన్మ స్థలం అయిన మథురలో మరియు బృందావన్లో హోలీ రోజు ప్రత్యేకమైన పూజలు చేస్తారు మరియు పండుగ చివరి 16 రోజులు, సంప్రదాయక పద్ధతులలో ఆచార వ్యవహారాలతో  కృష్ణుడిని పూజిస్తారు. మధుర నుండి 42 కిమి దూరంలో ఉన్నది  బర్సానాలో హోలీ రోజుకంటే ముందే హోలి వేడుకలు స్టార్టవుతాయి. ఇక్కడ హోలీ పండుగ కంటే ముందుగా విలక్షణమైన పధ్దతిలో హోలీ వేడుకలు చేసుకుంటారు . దీనినే లాత్ మార్ హోలీ అంటారు. హోలీ పండుగకు బర్సాన ప్రదేశం చాలా ప్రసిద్ధి. లాత్ మార్ హోలీలో కొన్ని వేల మంది సాక్షిగా స్త్రీలు పురుషులను కర్రలతో కొడతారు. పెద్దగా శ్రీ రాదే లేదా శ్రీ కృష్ణ . హోలీ పాటలను  పాడతారు.

బర్సానాలో హోలీ రోజున పురుషులు రెచ్చగొట్టే పాటలు పాడుతూ స్త్రీలను ఆకర్షించడానికి ప్రయత్నిస్తారు.స్త్రీలు పురుషులను కర్రలతో వెంబడిస్తారు.  స్త్రీలు కోపంతో వెళ్లి పురుషులను లాఠీలు అనే పొడవైన కర్రలను ఉపయోగించి కొడతారు. పురుషులు వారి దగ్గర ఉన్న డాలుతో కాపాడుకొంటారు.ఈ ఉత్సవాన్ని అన్ని గ్రామాలు కలసి ఉత్సాహాంగా జరుపుకొంటారు.

మన తెలుగు రాష్ట్రాల్లో కూడా హోలీ పండుగ సంబరాలు అంగరంగ వైభవంగా జరుపుకుంటారు . ఆంధ్రా తో పోలిస్తే తెలంగాణాలోనే హోలీ వేడుకలను రంగులు చల్లుకోవడంతో పాటు, బంగు తాగడం లాంటివి చేస్తుంటారు . అయితే ఈ సారి దేశవ్యాప్తంగా హోలీ సంబరాలు జరుపుకునేవారి శాతం తగ్గొచ్చు. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా కలవరపెడుతున్న కరోనా భయం. ఇప్పటికే హోలీ వేడుకలకు దూరంగా ఉండాలంటూ వాట్సప్లో మెసేజ్లు సర్క్యులేట్ అవుతున్నాయ. ఒక రోజు సంతోషం కోసం చూసుకోవడం కంటే బతికుంటే వచ్చేఏడాది చేసుకోవచ్చు అనుకునే వాళ్లే ఎక్కువున్నారు.

watch video:

image source:1 , 2 , 3