Ads
ఒక్కోసారి మనం ఎందుకు పనిచేయవు అనుకునే వస్తువులే మనకు ఎంతగానో ఉపయోగపడతాయి. మనం చాలా సార్లు ఖాళీ అయిపోయిన నూనె ప్యాకెట్లు పడేస్తుంటాం. కానీ ఈ ఖాళీ నూనె ప్యాకెట్లు మనకు ఎంతగానో ఉపయోగపడతాయని విషయం తెలిస్తే మీరు ఎప్పుడూ జన్మలో ఖాళీ నూనె ప్యాకెట్ లను అసలు పడేయరు.
Video Advertisement
ఆ ఖాళీ నూనె ప్యాకెట్ తో ఎన్ని లాభాలు ఉన్నాయో మనం తెలుసుకుందాం.. మనం ఆయిల్ ప్యాకెట్లు ఏదైనా డబ్బాలో పోసిన తర్వాత ప్యాకెట్ ఇంకా ఆయిల్ అంటుకునే ఎక్కువగా లోపలే ఉండిపోతుంది. ఎలా ఉండిపోయిన నూనె ప్యాకెట్ మనకు ఎంతో ఉపయోగపడతాయి.
#1.
కోడిగుడ్లు త్వరగా చెడిపోకుండా ఉండాలి అంటే ప్రత్యేకంగా ఆయిల్ తీసి ప్రత్యేకంగా రాసే పని లేకుండా, ఖాళీ చేసిన ఆయిల్ ప్యాకెట్ ని మూడు వైపులా కట్ చేసుకొని పాకెట్ లో ఉన్న ఆల్ ని అప్లై చేసుకుంటే సరిపోతుంది.
#2. ఇంట్లో వుండే స్క్రూ డ్రైవర్, కటింగ్ టూల్స్ వంటివి తుప్పు పట్టకుండా ఉండాలంటే మనం ప్రత్యేకంగా ఆయిల్ వంటివి రాస్తూ ఉంటాం. అలా నూనె వృధా చేయకుండా ఈ కట్ చేసిన నూనె ప్యాకెట్ కి ఉన్న ఆయిల్ ని టూల్స్ కి అప్లై చేయడం ద్వారా తుప్పు అనేది పట్టకుండా ఉంటుంది.
#3.
అదేవిధంగా మనం చపాతి పిండి వాటర్ లో కలిపి ముద్దగా అయిన తరువాత డైరెక్ట్ గా ఫ్రిడ్జ్ లో పెడతాం. ఆ ముద్దని కొన్ని గంటల తర్వాత తీసి చూస్తే పైన గట్టిగా అయిపోతుంటుంది. ఇలా గట్టిగా కాకుండా ఉండాలంటే మనం ఎక్స్ట్రాగా నూనె వాడవలసి వస్తుంది.
అలా కాకుండా ఆయిల్ ప్యాకెట్ ని కట్ చేసి ఆ ముద్దను దానిలో వేసుకొని ఒక సారి ఒత్తితే దానికున్న ఆయిల్ మొత్తం చపాతి ముద్దకు అంటుకుంటుంది. తర్వాత ఆ చపాతీ పిండి ముద్దను ఏదైనా కంటైనర్ లో పెట్టి, మూతతో క్లోజ్ చేసి ఫ్రిజ్లో పెడితే, వారం రోజులైనా చపాతి ముద్ద చక్కగా మృదువుగా అలాగే ఉంటుంది.
ఇలా చిన్న చిన్న చిట్కాలు పాటించడం ద్వారా అదనపు ఖర్చులు అనేవి తగ్గించుకోవచ్చు.
End of Article