కరోనాను జయించిన 103 ఏళ్ల బామ్మ…ఎలా సాధ్యం అయ్యింది అంటే..?

కరోనాను జయించిన 103 ఏళ్ల బామ్మ…ఎలా సాధ్యం అయ్యింది అంటే..?

by Anudeep

కరోనా కరోనా ఇప్పుడు ఎక్కడ చూసినా ఇవే వార్తలు . అందరిలోనూ భయం భయం , ముఖ్యంగా వృద్దులు, చిన్నపిల్లలు జాగ్రత్తగా ఉండాలని, వారిని ఇంటి నుండి బయటికి రానివ్వొద్దని ఈ రోజు కేంద్రం ప్రత్యేకంగా హెచ్చరించింది.  ఎక్కడ కరోనా బారిన పడతామో అని భయపడ్తున్న ముసలి వాళ్లకి ఈ వార్త ఆశల్ని కల్పిస్తుంది. సంకల్పం ఉంటే తాము కూడా కరోనాని జయించగలం అని నిరూపిస్తుంది. అసలు విషయమేంటంటే.

Video Advertisement

నూట మూడేళ్ల బామ్మ కరోనాని జయించింది . ఇరాన్ కి చెందిన ఈ బామ్మకి ప్లూ లక్షణాలు ఉండడంతో వారం రోజుల క్రితం సెమ్నాన్ హాస్పిటల్లో చేర్చారు. కరోనా పాజిటివ్ రావడంతో అక్కడే ఉంచి ట్రీట్మెంట్ ఇచ్చారు. ట్రీట్మెంట్ నడుస్తున్నప్పటికి బామ్మ బతుకుతుందనే ఆశ ఆ డాక్టర్లకు కూడా లేదు. కాని మరణాన్ని జయించింది. వైరస్ ని తట్టుకుని తన ఆరోగ్యాన్ని తను సంపాదించింది.

మరోవైపు ఇదే ఇరాన్ లో కెర్మన్ కి చెందిన 91 ఏళ్ల వృద్దుడు కూడా కరోనా వైరస్ బారిన పడ్డాడు. ఇతడు కూడా వైరస్ ని జయించాడు . మూడు రోజుల పాటు జ్వరంతో బాధపడిన అతను , తొందరలోనే కోలుకుని అందరిని ఆశ్చర్యపరిచాడు. ఇప్పుడు ఈ రెండు కేసులు ప్రపంచం మొత్తంలో ఉన్న వృద్దుల్లో , వారికి ట్రీట్మెంట్ ఇచ్చే డాక్టర్స్లో ఆశలు చిగురించేలా చేశాయి.

అరవై ఏళ్లు పైబడిన వారు కరోనా బారిన పడితే కోలుకోవడం కష్టం. WHO, చైనా అధికారులతో కరోనా బాధితులపై ఒక అధ్యయనం చేసింది. అందులో 80 ఏళ్ల కంటే ఎక్కువ వయసు ఉన్నవారు చనపోయే అవకాశాలు 21.9శాతంగా ఉన్నట్టు తేలింది.

ఇటలీలో వైరస్ బారిన పడిన ముసలివాళ్లని, వ్యాధి గ్రస్తులకి ట్రీట్మెంట్ కూడా ఇవ్వట్లేదనే దుర్బరమైన వార్తలు మనం చదివాం. అరవై సంవత్సరాల పై బడిన వారు, పదేళ్ల లోపు చిన్నిపిల్లలు చాలా జాగ్రత్తగా ఉండాలని ముందు నుండి చెప్తున్నారు. ఎందుకంటే వారిలో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. కాబట్టి వాళ్లే ఎక్కువగా ఈ వైరస్ బారిన పడే ప్రమాదం ఉంటుంది.

వ్యాక్సిన్ కనుగొనబడిన ఈ వైరస్ కి మన ఇమ్యునిటి ఒక్కటే సరైన మందు. అందుకే యుక్త వయసులో ఉన్నవాళ్లు, రోగ నిరోధక శక్తి బాగున్న వాళ్లు త్వరగా కోలుకుంటున్నారు. కాబట్టి చిన్నపిల్లలైన, ముసలి వాళ్లైన ఇమ్యునిటి పవర్ ఉంటే వైరస్ ని ఎదుర్కోగలరనడానికి ఇవి రెండు ప్రత్యక్ష ఉదాహరణలు.


You may also like

Leave a Comment