Ads
కామ్నా జఠ్మలానీ తెలుగులో పలు సినిమాలు చేసి ఆకట్టుకుంది. కత్తి కాంతారావు, బెండు అప్పారావు, రణం, భాయ్ ఇలా ఎన్నో సినిమాల్లో నటించింది. ఈ ముద్దుగుమ్మ. అందంతో, అభినయంతో ఆకట్టుకునే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఈమె నటించిన సినిమాలతో అనుకున్నంత గుర్తింపు మాత్రం పొందలేక పోయింది. దీంతో చిన్న సినిమాలు, ఐటమ్ సాంగ్స్ చేసి ఆ తర్వాత సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చింది కామ్నా జఠ్మలానీ.
Video Advertisement
ప్రముఖ వ్యాపారవేత్త సూరజ్ నాగపాల్ ను ఆరేళ్ల క్రితం బెంగళూరులో ఎవరికీ తెలియకుండా సీక్రెట్ గా వివాహం చేసుకుంది. ఆ తర్వాత కొన్ని సినిమాలు చేసినప్పటికీ కూడా వాటికీ కూడా అంతగా గుర్తింపు రాలేదు. అయితే ఇప్పుడు ఈమె ఫ్యామిలీ తో సమయాన్ని గడుపుతూ ఎంతో సంతోషంగా ఉంటోంది. తన ఫ్యామిలీ ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసింది ఈ భామ.
తన భర్త, పిల్లలతో పాటు ఉన్న ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో సరదాగా పంచుకుంది. వాటిని చూస్తే ఈమె చాలా ఆనందంగా ఉందని తెలుస్తోంది. అలానే ప్రస్తుతం ఒక హౌస్ వైఫ్ గా ఈమె ఎంతో ఆనందంగా వుంది అని ఆ ఫొటోస్ ని చూస్తే అర్ధం అవుతోంది.
ఇది ఇలా ఉంటే చాలా మంది నటీనటులు సినిమాల్లో రీఎంట్రీ ఇస్తూ ఉంటారు. కొద్ది కాలం పాటు గ్యాప్ ఇచ్చి ఆ తర్వాత మళ్లీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తూ ఉంటారు. ఆ తర్వాత వాళ్లకి తగ్గ పాత్రలు చేసి మరో సారి ఆకట్టుకుంటారు. అయితే ఈ భామ కూడా రీఎంట్రీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.
తాజాగా కామ్నా జఠ్మలానీ తెలుగులో ఓ సినిమా చేయడానికి సరే అందట. కొత్త దర్శకుడు ప్రభు తీస్తున్న ఈ సినిమాలో ఈమె ప్రధాన పాత్ర పోషిస్తోందని తెలుస్తోంది. అయితే మరి ఈమె రీఎంట్రీ ఇచ్చి ప్రేక్షకుల్ని మెప్పిస్తుంద లేదా అనేది చూడాలి.
End of Article