‘శాకుంతలం’ సినిమాలో “అల్లు అర్హ” ఎంత సేపు కనిపిస్తుందో తెలుసా..??

‘శాకుంతలం’ సినిమాలో “అల్లు అర్హ” ఎంత సేపు కనిపిస్తుందో తెలుసా..??

by Anudeep

గత ఏడాది ‘యశోద’ మూవీ రిలీజ్‌కి కొన్ని రోజులు ముందు తాను మయోసైటిస్ అనే దీర్ఘకాలిక కండరాల వ్యాధితో బాధపడుతున్నట్లు సమంత ప్రకటించింది. ప్రస్తుతం సామ్ ఈ వ్యాధి నుంచి కోలుకుంటోంది. అయితే ఇంటి వద్దే రెస్ట్ తీసుకుంటున్న సమంత శాకుంతలం ట్రైలర్ లాంచ్ కి బయటకి వచ్చింది. పౌరాణిక నేపథ్యం లో వస్తున్నా ఈ చిత్రం పై అటు గుణశేఖర్, ఇటు సామ్ చాలా అంచనాలు పెట్టుకున్నారు. ఈ చిత్రం లో సమంత శకుంతల పాత్రలో నటిస్తుండగా.. మలయాళ నటుడు దేవ్ మోహన్ దుశ్యంతుడిగా నటిస్తున్నారు.

Video Advertisement

 

 

అయితే ఈ చిత్రం తో ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ గారాల పట్టి అల్లు అర్హ సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇస్తోంది. ఇటీవలే రిలీజైన ట్రైలర్‌లో అర్హ సింహంపై స్వారీ చేస్తున్న క్లిప్‌ ట్రైలర్‌కే హైలేట్‌గా నిలిచింది. ఇన్ని రోజులు ఇన్‌స్టాగ్రామ్‌లో అల్లరి వీడియోలు, ఫోటోలతో అలరించిన అర్హ ఇప్పుడు బిగ్ స్క్రీన్ పై కనిపించనుండడంతో అల్లు అర్జున్‌ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. ఈ చిత్రం లో యువరాజు భరతుడి పాత్రలో అర్హ కనిపించనుంది.

how much screen time did arha got in shakunthalam movie..

అయితే తాజాగా ఈ సినిమాలో అర్హ స్క్రీన్‌టైమ్‌ గురించి గుణశేఖర్‌ అభిమానులతో పంచుకున్నాడు. ఈ సినిమాలో అల్లు అర్హ పాత్ర ఆరు నిమిషాలు ఉండనుందట. రెండున్నర గంటల సినిమాలో ఆరు నిమిషాలు అర్హ పాత్ర ఉండడం విశేషమే. దీన్ని బట్టి చూస్తే అర్హ క్యారెక్టర్‌కు సినిమాలో ఎంత మంచి స్కోప్‌ ఉందో తెలుస్తుంది. ఇప్పటికే ఈ పాత్రకి సంబంధిన డబ్బింగ్ ని కూడా పూర్తి చేసింది అర్హ. మరో వైపు పవన్‌ ‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’లో ఓ కీలక పాత్ర కోసం అర్హను ఎంపిక చేయాలని మేకర్స్ భావిస్తున్నారట. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

how much screen time did arha got in shakunthalam movie..

అయితే దేవ్ మోహన్ ను ఈ సినిమాలో ఎందుకు తీసుకున్నారు ఏదైనా తెలుగు హీరోని తీసుకోవచ్చు కదా అని దర్శకుడు గుణశేఖర్ ని అడిగితే ఏ తెలుగు హీరో ఈ సినిమాలో చేయడానికి ఆసక్తి చూపించలేదని ఆయన చెప్పుకొచ్చారు. ఫిబ్ర‌వ‌రి 17న తెలుగు, త‌మిళం, మ‌ల‌యాళం, క‌న్న‌డ‌తో పాటు హిందీలోనూ ఈ సినిమాను రిలీజ్ చేయ‌బోతున్నారు. శాకుంత‌లం సినిమాను గుణ‌శేఖ‌ర్ త‌న‌య నీలిమ గుణ‌తో క‌లిసి దిల్‌రాజు నిర్మిస్తున్నారు. ఈ సినిమాను గుణశేఖర్‌ రుద్రమదేవి తర్వాత దాదాపు ఏడేళ్లు గ్యాప్‌ తీసుకొని రూపొందించాడు.


You may also like