షేర్స్ ని ఎలా కొనాలి..? డీమాట్ అకౌంట్ లను ఎలా ఓపెన్ చేసుకోవాలి..? తెలుసుకోండి..!

షేర్స్ ని ఎలా కొనాలి..? డీమాట్ అకౌంట్ లను ఎలా ఓపెన్ చేసుకోవాలి..? తెలుసుకోండి..!

by Anudeep

Ads

వ్యాపారం లో ఎక్కువ సంపాదన ఉంటుందని సాధారణం గా అందరు అభిప్రాయపడుతుంటారు. అలానే, తక్కువ టైం లో నే ఎక్కువ సంపాదించుకోవడం కోసం కొందరు షేర్స్ ని కొంటారు..స్టాక్స్ లో తమ పెట్టుబడిని పెడుతుంటారు. అయితే, వీటిపై పూర్తి అవగాహనా లేకుండా ప్రయత్నాలు చేయకూడదు. ముందు, వీటి గురించి పూర్తి గా తెలుసుకుని, అవగాహన పెంచుకున్న తరువాత ప్రారంభించాలి. స్టాక్స్ కొనాలంటే ముందు గా మనకి డీమాట్ అకౌంట్ అవసరమవుతుంది. అసలు డీమాట్ అకౌంట్ అంటే ఏంటి..? షేర్స్ ని ఎలా కొనాలి.. అనే అంశాలను ఈ ఆర్టికల్ లో తెలుసుకోండి.

Video Advertisement

demat account 1

ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ చేయదలుచుకున్న వారు డీమాట్ అకౌంట్ అనే పదాన్ని తరచుగా వాడుతూ ఉంటారు. ఈ ఖాతాలకు పెరుగుతున్న డిమాండ్ భారతీయుల్లో డబ్బు సంపాదన ను పెంచుకోవడం పట్ల కలిగి ఉన్న ఆసక్తిని సూచిస్తుంది. మనం ఏదైనా షేర్స్ కొన్నా, స్టాక్స్ లో ఇన్వెస్ట్మెంట్ పెట్టినా, మన వాటా ఎంతో తెలియడానికి, మన వాటాని మనకి అందించడానికి మనకి ఒక ఖాతా అవసరం అవుతుంది. బ్యాంక్స్ లో పర్సనల్ అకౌంట్ లాగా.. స్టాక్ మార్కెట్ లో డీమాట్ ఖాతా ఉండాల్సి ఉంటుంది.

demat account 2

డీమాట్ అనేది ఒక డీమెటీరియలైజేషన్ అకౌంట్. అంటే.. స్టాక్ మార్కెట్ లో బిజినెస్ చేసే వారు తమ సెక్యూరిటీలను ఎలక్ట్రానిక్ ఫార్మట్ (డిజిటలైజ్డ్ ఫార్మాట్) లో పొందుపర్చుకోవచ్చు. పేపర్ సర్టిఫికెట్ లను భద్రపరచడం కంటే.. డిజిటల్ ఫార్మాట్ లో సర్టిఫికెట్ లను భద్రపర్చుకోవడం చాలా తేలిక. అందుకే డిమాట్ అకౌంట్ కచ్చితం గా ఉండాలి. దీని ద్వారా మీరు డబ్బుని దాచుకోవచ్చు. విత్ డ్రా చేసుకోవచ్చు. ఎప్పుడు కావాలనుకుంటే అపుడు డిపాజిట్ చేసుకోవచ్చు. మీరు వద్దు అనుకుంటే మీ డిమాట్ అకౌంట్ జీరో బాలన్స్ ఉంచినప్పటికీ నష్టమేమి ఉండదు.

demat 4

అసలు డీమాట్ అకౌంట్ ను ఎలా తెరవాలి..?
డీమాట్ అకౌంట్ ను తీసుకునే ముందు రెండు విషయాలను దృష్టిలో ఉంచుకోవాలి. మొదటిది సేఫ్టీ, రెండోది బ్రోకరేజి. డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసే ముందు ఎవరిదగ్గర పడితే వారిదగ్గర ఓపెన్ చేయకుండా, ఆల్రెడీ ప్రూవ్ అయి మంచి పేరు తెచ్చుకున్న సంస్థల్లోనే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయాలి. అలానే, బ్రోకరేజి సర్వీసులు ఆఫర్ చేసేవారు ఎంత మొత్తం లో సర్వీస్ ఛార్జ్ తీసుకుంటున్నారు అన్న విషయాలను కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది. బ్రోకరేజి లు అనేవి డిమాట్ ఖాతాతో మీరు జరిపే లావాదేవీలకు సహకరిస్తాయి. ఈ సంస్థలు లేదా బ్యాంకులనే డిపాజిటరీ పార్టిసిపంట్స్ గా వ్యవహరిస్తుంటారు.

demat account 3

మీరు ఈ డిపాజిటరీ పార్టిసిపంట్స్ సహకారం తో డిమాట్ అకౌంట్ తెరిస్తే.. మీరు కొనే అసలు షేర్లు సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ ఇండియా లిమిటెడ్ (CDSL) , నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ (NSDL) ల అదుపులో ఉంటాయి. డిమాట్ అకౌంట్ సాయం తో మీరు షేర్లను కొనగలరు లేదా అమ్మగలరు. కానీ, మీరు పెట్టుబడి పెట్టాలని అనుకుంటే మాత్రం మీకు కచ్చితం గా ట్రేడింగ్ అకౌంట్ అవసరమవుతుంది.

demat 5

  • ఆన్ లైన్ లో డిమాట్ అకౌంట్ ను తెరవడం సులభమైన పద్ధతే. మీరు డీమాట్ అకౌంట్ తీసుకునే ముందు kyc వివరాలతో పాటు మీరు డిపాజిటరీ భాగస్వామి గా తీసుకునే బ్రోకింగ్ సంస్థ యొక్క అకౌంట్ అప్లికేషన్ ఫారం నింపాల్సి ఉంటుంది. వీటితో పాటు, మీరు పుట్టిన తేదీ, ఇమెయిల్ అడ్రస్, పాన్ కార్డు, బ్యాంకు అకౌంట్ డీటెయిల్స్ కూడా అందించాలి.
  • అన్ని వివరాలు పొందుపరిచాక, నియమాలు , నిబంధనలతో కూడిన డాక్యుమెంట్ ను పూర్తి గా చదివి అర్ధం చేసుకోవాలి. ఆ తరువాత అప్లై చేయాలి
  • మీరు ఏ నెంబర్ ఐతే రిజిస్టర్ చేసారో.. ఆ నెంబర్ కు ఒక ఓటీపీ వస్తుంది. తద్వారా వెరిఫై చేసిన తరువాత మీ ఫోన్ నెంబర్ కు మీ డిమాట్ ఖాతా వివరాలను తెలియచెప్పే మెసేజ్ వస్తుంది.
  • అయితే, ఇలా ఖాతా ఓపెన్ చేయించే సంస్థలు చాలా వరకు వ్యక్తిగత ధ్రువీకరణ ను కోరతాయి. ఖాతా ఓపెన్ చేసుకునే వారు సదరు సంస్థను సందర్సించాలి.. లేదా వారి సంస్థ కు చెందిన ప్రతినిధి ఎవరైనా మీరు ఉండే చోటు కు వచ్చి ధృవీకరించుకుని వెళతారు.
  • మీరు సబ్మిట్ చేసిన డాకుమెంట్స్ అన్ని ధ్రువీకరణ పొందిన తరువాతే, మీకు డిమాట్ ఖాతా నెంబర్ ఇవ్వబడుతుంది.
  • డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసేముందు సరైన డిపాజిటరీ పార్టిసిపంట్ ను గుర్తించడం చాలా కీలకమైనది. షేర్లను కొనడం ద్వారా మీరు ఆర్ధిక వెసులుబాటుని పెంచుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అదే సమయం లో మీరు నమ్మకమైన డీమాట్ భాగస్వామ్యాన్ని గుర్తించడం కూడా అంతే అవసరం.

 


End of Article

You may also like