Ads
“ప్రసూతి వైరాగ్యం” వినే ఉంటారు.. శ్మశాన వైరాగ్యం వినే ఉంటారు..లాక్ డౌన్ వైరాగ్యం కూడా వింటారు..కాని అలాంటి వైరాగ్యం రాకుండా జనాల్ని కాపాడుతున్నవి ఆటలే..వాటిల్లో ఇప్పుడు పాపులర్ గేమ్..లూడో.. అష్టాచెమ్మా ఆడి కరోనా తెచ్చుకునే కంటే, ఎవరింట్లో వాళ్లం కూర్చుని లూడో ఆడుకోవడం బెటర్ అనేది ఇప్పుడు ట్రెండింగ్ టాపిక్..ఇంతకంటే ట్రెండింగ్ టాపిక్ ఒకటుంది..అదేంటో తెలుస్తా..జనాలు ఇలా తయారయ్యారేంట్రా అనుకోవడం ఖాయం..
Video Advertisement
“ జనతా కర్ఫ్యూ” ఒకరోజు ప్రకటించగానే ప్రజలంతా హాహాకారాలు చేశారు..వెంటనే లాక్ డౌన్ ప్రకటన చేయడంతో చేసేదేం లేక సైలెంట్ గా ఇంట్లో కూర్చున్నారు..మనం కూర్చోకపోతే కరోనా పడుకోబెట్టేస్తుంది మరీ..లాక్ డౌన్ మొదటి రెండు రోజులు బోర్ ఫీలైనప్పటికి లాక్ డౌన్ 2.0 ప్రకటన అప్పటికి అలవాటైంది..ఈ అలవాటు చేసుకోవడానికి మనోళ్లు పెద్ద యుద్దమే చేశారు..మొబైల్ ఫోన్ చూసి చూసి బోర్ కొట్టిన జనాలు ఆఖరికి ఆటలపై పడ్డారు..
అష్టాచెమ్మా, వైకుంఠపాళి, దాడి అంటూ రకరకాల ఆటల్ని మళ్లీ తెరమీదకి తెచ్చారు.. అష్టాచెమ్మ ఆడిన వారికి కరోనా అనే వార్త రాగానే అది పక్కన పెట్టేశారు.మరోవైపు పేకాటది అదే పరిస్థితి..దాంతో అందరూ “లూడో” కే జై కొట్టారు. ఈ ఆటలో ఎప్పుడూ అమ్మాయిలే నెగ్గుతారనే అపవాదు ఉంది..దాంతో లూడో గేమ్ గెలవడం ఎలా అంటూ సెర్చింగ్ మొదలు పెట్టేశారు.. ప్రస్తుతం గూగుల్ సెర్చింగ్లో ఉన్న విషయం ఏంటో తెలుసా “how to win ludo”.. “ludo king tips”.. దీన్నే మన భాషలో “తొండి” ఆట అంటారు..
ఇప్పుడు లూడో కింగ్ అవ్వడం అనేది ఒక దేశానికో, రాజ్యానికో కింగ్ అవ్వడం అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు చాలామంది.. ఇప్పటికే ఈ ఆట కుటుంబాల్లో చిచ్చు పెట్టింది..మొన్నటికి మొన్న తనని ప్రతి ఆటలో ఓడిస్తుందని భార్య నడుము విరగ్గోట్టాడో భర్తాసురుడు.. ఏదేమైనప్పటికి ఇప్పుడు మన ముఖ్య కర్తవ్యం “టైం పాస్” అయిందా లేదా అన్నది.. అంతేకాని గెలిచామా లేదా అని కాదు.. So chill guys…
End of Article