వాట్సాప్ లో ఈ ట్రిక్ మీకు తెలుసా..? బ్లూ టిక్ ఆఫ్ చేసినా ఇలా తెలుసుకోవచ్చు.!

వాట్సాప్ లో ఈ ట్రిక్ మీకు తెలుసా..? బ్లూ టిక్ ఆఫ్ చేసినా ఇలా తెలుసుకోవచ్చు.!

by Anudeep

ప్రపంచ వ్యాప్తంగా జనాధారణ పొందిన సోషల్ మీడియా యాప్స్ లో వాట్సప్ ఒకటి. ఛాటింగ్ , కాలింగ్ , ఫొటో స్ మరియు వీడియోస్ సెండ్ చేసుకోవడానికి , అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్కోవడానికి ఇలా ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. మనం వాట్సప్ వాడుతున్నప్పటికి కొన్ని సెట్టింగ్స్ పూర్తిగా మనకి తెలీదు. వాటిల్లో ఒకటి బ్లూ టిక్స్ రాకుండా సెట్ చేయడం,అలా సెట్ చేస్తే మన మెసేజ్ చదివారో లేదో తెలియదు. బ్లూ టిక్స్ రాకపోయినా ఎదుటి వ్యక్తి మన మెసేజ్ చదివారో లేదో తెలుసుకోవడం చాలా సింపుల్…అదెలా అంటే..

Video Advertisement

వాట్సప్ లో వచ్చే బ్లూ టిక్స్ ద్వారా ఎదుటి వ్యక్తి మన మెసెజ్ చూసారో, లేదో తెలిసిపోతుంది . కానీ కొంత మంది ఆ బ్లూ టిక్స్ రాకుండా ఆఫ్ చేస్తారు. దాని కోసం ఏం చేస్తారంటే సెట్టింగ్స్ లోకి వెళ్లి, ప్రైవసీ సెట్టింగ్స్ లో రీడ్ రిసిప్ట్స్ అనే దాన్ని ఆఫ్ లో పెడతారు. దీని వల్ల బ్లూ టిక్స్ రాకుండా , ఎదుటి వ్యక్తి మన మెసేజ్ చూసినప్పటికి చూడనట్టుగానే మనకి కనిపిస్తుంది. కానీ ఆ బ్లూ టిక్స్ రానప్పటికి మన మెసేజ్ చూసింది లేనిది తెలుసుకోవచ్చు. దానికోసం ఏం చేయక్కర్లేదండీ చాల సింపుల్ ఈ సారి మీరు మెసేజ్ టైప్ చేసి పంపించకుండా , ఒక ఆడియో రికార్డ్ చేసి పంపించండి.

జస్ట్ ఫర్ చెకింగ్ కి ఒకటి లేదా రెండు సెకన్ల ఆడియోని ఏం మాట్లాడకుండా రికార్ట్ చేసి పంపండి. అప్పుడు మాత్రం వాళ్లు ఆ ఆడియో మెసెజ్ ఓపెన్ చేయగానే బ్లూ టిక్స్ వచ్చేస్తాయి.. ఇంకేముంది వాళ్ల మన ముందు మెసెజెస్ కూడా చూసారని ఈజీగా తెలిసిపోతుంది. తాడిన తన్నేవాడుంటే వాడి తలదన్నేవాడుంటానే సామెత ఊరికే రాలేదు.

image source: 1 , 2


You may also like