వైన్ షాప్స్ లేక…మందు బాబులు నెట్ లో ఏం సెర్చ్ చేస్తున్నారో తెలుసా? తెలంగాణ టాప్ 5 లో

వైన్ షాప్స్ లేక…మందు బాబులు నెట్ లో ఏం సెర్చ్ చేస్తున్నారో తెలుసా? తెలంగాణ టాప్ 5 లో

by Anudeep

Ads

మందుబాబులం..మేము మందుబాబులం..మందుకొడితే మాకు మేమే మహారాజులం.. లాక్ డౌన్ వేళ ఒక్కొక్కరిది ఒక్కో లొల్లి . తాగుబోతులది మరో లొల్లి.. లాక్ డౌన్ ఎప్పుడెత్తేస్తారా? మందు ఎప్పుడు అందుబాటులోకి వస్తుందా అని కొందరు మందుబాబులు ఎదురుచూస్తుంటే , మరికొందరు ఏకంగా ఇంట్లోనే మందు తయారు చేసుకోవడం గురించి ఆలోచిస్తున్నారు.ఇది మేం చెప్పట్లేదు..గూగుల్ తల్లే చెప్తుంది.

Video Advertisement

లిక్క‌ర్ షాపులు క్లోజ్ చేసేయడంతో, ఎలా అయినా మందుచుక్కతో నోరు తడుపుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు మందుబాబులు. లాక్ డౌన్ తొలిరోజుల్లో బ్లాక్లో కొనుక్కుని తాగారు. కానీ ఎంతకాలం అలా తాగగలరు.  బ్లాక్ లో ఒక్కో బాటిల్ ఏకంగా మూడు నాలుగు రెట్లు ఎక్కువ చేసి అమ్ముతుంటే, అదికూడా కష్టమైపోయింది . ఇక చేసేదేం లేక ఒక మార్గం ఆలోచించారు. ఇంట్లో మందు తయారు చేసుకోవాలని ఫిక్సయ్యారు.ఇది మేం చెప్పట్లేదండి.. మందు తయారు చేసుకోవడం ఎలా అని గూగుల్లో వెతకడం మొదలు పెట్టారు. “How to make alcohol at home” ఇది ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది.

లాక్ డౌన్ పెట్టిన ఫస్ట్ వీక్ లోనే  అంటే మార్చి 22 నుంచి 28 మ‌ధ్య ఈ సెర్చ్ పీక్ లోకి వెళ్లింది. మార్చి 22 నుంచి ఏప్రిల్ 15 వరకు కూడా గూగుల్ ట్రెండ్స్ లో ఈ సెర్చ్ టాప్ ప్లేస్ లోనే ఉంది. ఇలా సెర్చ్ చేసిన స్టేట్స్లో మణిపూర్ ఫస్ట్ ప్లేస్ కాగా,ఆ త‌ర్వాత జ‌మ్ము క‌శ్మీర్, ఉత్త‌రాఖండ్, జార్ఖండ్, అస్సాం ఉన్నాయి. ఆరో స్థానంలో ఏపీ, ప‌దో స్థానంలో తెలంగాణ ఉన్నాయి.

కేవలం ఆల్కహాల్ కోసమే కాదు,  ఆల్క‌హాల్ త‌యారీ కోసం సెర్చ్ చేసిన‌ట్లుగానే బీర్ ఇంట్లోనే ఎలా చేసుకోవాల‌న్న దాని కోసం కూడా దేశంలో లాక్ డౌన్ పెట్టిన త‌ర్వాత జ‌నాలు విప‌రీతంగా సెర్చ్ చేశారు. మార్చి 29న “how to make beer at home” అన్న సెర్చ్ పీక్ లోకి వెళ్లింది. బీర్ కోసం సెర్చ్ చేసిన వారిలో తెలంగాణా టాప్ ఫైవ్ లో ఉంది.. అదీ సంగతి.. మొన్నీ మధ్య ఎవరో ఇలాగే సొంతంగా మందు తయారు చేసుకుని వికటించి చనిపోయారు. కాబట్టి లాక్ డౌన్ ఎత్తేశాక బతికుంటే బడ్వైజర్ తాగొచ్చు కాని..ఇప్పుడు ప్రయోగాలు చేయకండి.


End of Article

You may also like