ఇంట్లోనే శానిటైజర్‌ ఇలా సింపుల్ గా చేసుకోండి..! ఆ నాలుగు ఉంటే చాలు.! 15 రూపాయలు మాత్రమే

ఇంట్లోనే శానిటైజర్‌ ఇలా సింపుల్ గా చేసుకోండి..! ఆ నాలుగు ఉంటే చాలు.! 15 రూపాయలు మాత్రమే

by Anudeep

Ads

కరోనా వైరస్ ప్రపంచ దేశాలన్నింటికి వ్యాపించింది . సామాన్యుల నుండి సెలబ్రిటీల వరకు ప్రతి ఒక్కరూ కరోనా గురించి కలవరపడుతున్నారు. మన దేశంలో కరోనా సోకుతున్న వారి సంఖ్యరోజురోజుకి పెరుగుతుంది. కరోనా వైరస్ బారిన పడకుండా ఉండడానికి శుభ్రత ముఖ్యం అని డాక్టర్లు సూచించిన విషయం విధితమే.  దాంతో శానిటైజర్లు, మాస్కులకు విపరీతమైన డిమాండ్‌ పెరిగింది .

Video Advertisement

ఇదే అవకాశం అని అమాంతం మాస్కులు, శానిటైజర్ల రేట్లు పెంచేశారు. మాస్కుల ఖరీదు టూ మచ్ గా పెంచేయడంతో ఇంట్లో ఉన్న ఖర్చీప్, స్కార్ఫ్ లనే మాస్కులుగా వాడుతున్న పరిస్థితి. దాంతో పాటు మార్కెట్లో శానిటైజర్ల కొరత ఏర్పడింది. స్వయంగా శానిటైజర్లను తయారు చేస్కోవడం ఎలా అనేదానిపైన ప్రజలు దృష్టి పెట్టారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) ఫార్ములాను ప్రతి ఒక్కరూ తెలుసుకుంటున్నారు.డాక్టర్లు కూడా శానిటైజర్‌లను ఎలా తయారు చేసుకోవాలనే విషయమై అవగాహన కల్పిస్తూ, ఎలా తయారు చేసుకోవాలో వీడియోలు పెడుతున్నారు.

కేవలం పంతొమ్మిది రూపాయలతోనే 250మి.లీ శానిటైజర్ తయారు చేసుకునే పద్ధతిని చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ట్విట్టర్ లో పోస్టు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. శానిటైజర్‌ తయారీకి కావలసిన పదార్దాలు, ఆ పదార్ధాలు దొరికే స్థలాలు, శానిటైజర్ తయారి విధానం మొదలగు వివరాలు తన ట్విట్టర్లో పోస్టు చేశారు విశ్వేశ్వర్ రెడ్డి. శానిటైజర్‌ తయారీకి వినియోగించే లిక్విడ్స్ నగరంలోని అబిడ్స్‌ తిలక్‌రోడ్‌లోని ల్యాడ్‌ కెమికల్స్‌ విక్రయించే దుకాణాల్లో లభిస్తాయట.

తయారు చేసుకునేందుకు కావలసినవి:

  •  స్వచ్ఛమైన నీరు – 90 మి.లీ.
  • ఐసోప్రొపైల్‌ ఆల్కహాల్‌ – 100 మి.లీ.
  • హైడ్రోజన్‌ పెరాక్సైడ్‌  – టేబుల్‌ స్పూన్‌
  • గ్లిజరిన్‌/గ్లిజరాల్‌ – టేబుల్‌ స్పూన్‌

తయారీ చేసుకునే విధానం

ముందుగా 100 మి.లీ ఐసోప్రొపైల్‌ ఆల్కహాల్‌ను శుభ్రమైన పాత్రలో తీసుకోవాలి. దీనికి టేబుల్‌ స్పూన్‌ చొప్పున గ్లిజరిన్‌, హైడ్రోజన్‌ పెరాక్సైడ్‌ కలపాలి. దీనికి 90 మి.లీ శుద్ధమైన నీరు పోయాలి. అనంతరం ఈ మిశ్రమాన్ని బాగా కలిపి ఖాళీ స్ప్రే బాటిల్‌ లేదా డిస్పెన్సింగ్‌ బాటిల్‌లో పోసి శానిటైజర్‌గా వాడుకోవచ్చు.

“ Necessity is the mother of invention” అని ఊరికే అనలేదు. ప్రస్తుతం సానిటైజర్స్ విషయంలో కూడా ఇదే సామెత ఉపయోగపడుతోంది. కరోనా వ్యాప్తి నేపధ్యంలో నిన్నా మొన్నటి వరకు సానిటైజర్స్, మాస్కుల కోసం బారులు తీరిన జనం, ఇప్పుడు స్వయంగా తయారు చేస్కోవడంపై దృష్టి పెట్టారు.

watch video:


End of Article

You may also like