Ads
ఆ బస్సు సాధారణ ప్రభుత్వ బస్సులకు భిన్నంగా ఉంటుంది. బస్సులో ఎల్ఈడీ లైట్లు, మ్యూజిక్ సిస్టమ్తో కూడిన బస్సు గదులు ఉంటాయి. ఇక ప్రయాణికుల భద్రత కోసం బస్సులో సీసీటీవీ కెమెరా కూడా ఉంది. అయినప్పటికీ ఇక్కడ స్పెషల్ ఎట్రాక్షన్ ఆ బస్సు డ్రైవర్, లేడీ కండక్టర్ అంటున్నారు అక్కడి ప్రయాణికులు.
Video Advertisement
వారు స్వయంగా భార్యభర్తలు.. భర్త బస్ డ్రైవర్ కాగా, భార్య అందులోనే కండక్టర్గా పనిచేస్తోంది. ప్రస్తుతం ఆ జంటకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దాన్ని చూసిన నెటిజన్లు వాళ్లను తెగ మెచ్చుకుంటున్నారు. గిరి,తారా అని ఇద్దరు భార్యాభర్తలు కలిసి బస్సును నడుపుతున్నారు.
అయితే ఇందుకోసం వారు ప్రభుత్వాన్ని పర్మిషన్ అడిగారు. అనుమతి లభించడంతో ఈ బస్సును ఆ జంట కలర్ ఫుల్ గా డెకరేట్ చేసింది. అంతేకాకుండా ఆ బస్సు లోపల మ్యూజిక్ సిస్టం, ఆరు సీసీ కెమెరాలు, ఎమర్జెన్సీ స్విచ్ లు, ఎల్ఈడి డెస్టినేషన్ బోర్డ్, ఆటోమేటిక్ ఎయిర్ ఫ్రెష్ నర్స్ ఇలా ఎన్నో సౌకర్యాలు ఉన్నాయి. గిరి, తార సొంత డబ్బు ఖర్చు చేసి ఈ బస్సును అందంగా తీర్చిదిద్దారు. 20 ఏళ్లుగా ప్రేమించుకుంటున్న వీరు ఇటీవలే వివాహం చేసుకుని ఒక్కటయ్యారు.
గోపీనాథ్, తార ఒక ప్రైవేట్ సంస్థలో పనిచేస్తుండగా పరిచయం పెరిగింది. పరిచయం కాస్త ప్రేమగా మారింది. అయితే వీరి ఇరువురి కుటుంబసభ్యులు పెళ్లికి అభ్యంతరం చెప్పారు. ఎట్టకేలకు కోవిడ్ లాక్డౌన్ మధ్య ఈ జంట 2020లో పెళ్లి చేసుకున్నారు. ఆ సమయంలో ఇద్దరూ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షకు ప్రిపేర్ అయ్యారు. ప్రస్తుతం ఇద్దరూ హరిపాడు డిపోలో పనిచేస్తున్నారు. అసలైన ప్రేమకు నిదర్శనంగా నిలుస్తున్నారు ఈ కేరళ జంట.
End of Article