భార్య వేధింపులు తట్టుకోలేని ఆ భర్త ఏమి చేసాడో తెలిస్తే నవ్వకుండా ఉండలేరు

భార్య వేధింపులు తట్టుకోలేని ఆ భర్త ఏమి చేసాడో తెలిస్తే నవ్వకుండా ఉండలేరు

by Anudeep

Ads

ప్రతి కుటుంబంలో భార్య భర్తల మధ్య చిన్న చిన్న గొడవలు సహజం అప్పుడప్పుడు కొన్ని వస్తూ పోతూ ఉంటాయి.కొన్ని కొన్ని సార్లు అవి మరీ మితి మీరి ప్రాణాల మీదికి తీసుకువస్తూ ఉంటాయి.భార్య పెట్టె ఇబ్బందులు తట్టుకోలేని ఒక భర్త తనకు తానూ చనిపోయినట్టుగా చిత్రీకరించుకున్న సంఘటన బీహార్ లోని కైమూర్ జిల్లాలో ఎదురైంది.పోలీసుల కథనం తన భర్త కనిపించట్లేదు చనిపోయాడు అంటూ కేసు ని నమోదు చేసింది

Video Advertisement


భార్య కుమారి ప్రతిభ భర్త ప్రదీప్ రామ్.గత మంగళవారం రాత్రి (29 న) తమ నూతన గృహ నిర్మాణం జరుగుతున్న తన ఇంటి వద్దే పడుకుకోటానికి వెళ్లాడని ఉదయం అక్కడ వెళ్లి చూసే సరికి మొత్తం రక్తం మరకలు పడి ఉండటంతో తన భర్త హత్య కి గురయ్యాడేమో అని అనుమానంతో పోలీసులకి ఫిర్యాదు చేసింది.FIR నమోదు చేసిన పోలీసుల విచారణలో ఎన్నో వింతలు అనుమానాలు బయటపడ్డాయి తన భర్త కోసం వెతికిన పోలీసులకి ఎక్కడ శరీరం దొరకలేదు విచారణలో ఘటన స్థలానికి 500 మీటర్ల దూరంలో రక్తపు మరకలు గల మినరల్ వాటర్ బాటిల్స్ దొరికాయి.అంతే కాకుండా గుర్తు తెలియని వ్యక్తులు రక్తాన్ని మంచానికి మొత్తం పోసి కింద చల్లారని పోలీసుల విచారణ లో తెలిసింది.మొత్తానికి ప్రదీప్ ని కనుగొన్న పోలీసులు తీసుకెళ్లి విచారించంగా తన భార్య పెట్టె కష్టాలు వేధింపులు తాళలేక ఒక మేక రక్తం కొని తన పరుపు కి మొత్తం రక్తం పోసి తానే చనిపోయినట్టు సృష్టించుకున్నాడని చెప్పాడు.ఇది తెలిసిన పోలీసులు భార్యని మందలించారు.

 

 


End of Article

You may also like