ఈ దుర్ఘటన తమిళనాడు రాష్ట్రము లో తిరుప్పూరు జిల్లాలో చోటు చేసుకుంది. విజయ్ ఓ వ్యక్తి తన భార్య కు ఎన్ని సార్లు కాల్ చేసినా లిఫ్ట్ చేయక పోవడం తో అనుమానం వచ్చి వెళ్లి చూడాల్సింది గా దగ్గరలోని కిరాణా షాప్ ఓనర్ కి ఫోన్ చేసి కోరారు. అప్పుడు షాప్ లో ఉన్న చిత్ర ఆయన ఇంటికి వెళ్లి చూడగా.. ఆయన భార్య ప్రియ రక్తపు మడుగు లో పడి ఉంది. విజయ్, ప్రియ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆగష్టు 25 న ఎప్పటిలానే ఆఫీస్ కు వెళ్లిన విజయ్ తన భార్య ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం తో అనుమానం వచ్చింది.

priya

అనుమానం తోనే దగ్గరలోని కిరాణా దుకాణానికి ఫోన్ చేసాడు. దీనితో అసలు సంగతి తెలిసింది. షాప్ ఓనర్ చిత్ర వెళ్లేసరికి ప్రియ విగతజీవి గా ఉంది. ఇంట్లో చోరీ జరిగినట్లు ఆమె గుర్తించింది. వెంటనే విజయ్ కు ఫోన్ చేసి విషయం వివరించడం తో.. విజయ్ హుటాహుటిన ఇంటికి చేరుకున్నాడు. పోలీసులకు సమాచారం అందించడం తో వారు కూడా ఘటనాస్థలానికి చేరుకున్నారు.

Sad incident in padamatalanka

 

ఆమె మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం తరలించి కేసు నమోదు చేసుకున్నారు. ప్రియ వంటిపైన బంగారం, ఇంట్లోని వెండి వస్తువులు సైతం చోరీకి గురయ్యాయి. ప్రియ దవాడ పైన, మెడ పైన గాయాలు ఉన్నాయి. ఐతే ఈ హత్య నగల కోసం చేయబడిందో.. లేక కుటుంబ విబేధాలు ఏమైనా ఉన్నాయో..? అన్న దిశగా పోలీసులు దర్యాప్తు చేసారు. ఈ క్రమం లో పోలీసులకు షాకింగ్ నిజాలు తెలిసాయి.

ప్రియకు మరో వ్యక్తి తో వివాహేతర సంబంధం ఉంది. విజయ్ కు కూడా పెళ్ళికి ముందే వివాహం అయింది.. విడాకులు తీసుకుని.. ఆ విషయం దాచిపెట్టి ప్రియను పెళ్లి చేసుకున్నాడు. ఐతే ప్రియ కూడా మరో వ్యక్తి తో ఫోన్ లో మాట్లాడుతుండడాన్ని సహించలేకపోయాడు. ఆగష్టు 25 న కూడా ఇలాగె ఆఫీస్ కి వెళ్లి ప్రియ కు ఫోన్ చేసాడు. ఐతే ఆమె కాల్ వెయిటింగ్ వస్తున్నా కూడా భర్త ఫోన్ లిఫ్ట్ చేయకుండా ఎవరితోనో మాట్లాడుతూ ఉంది.

murder 2

దీనితో ఆగ్రహించిన విజయ్ ఆమెను హత్య చేసాడు. దానిని కప్పిపుచ్చడం కోసం ఇది దొంగతనం కోసం జరిగిన హత్య గా డ్రామా సృష్టించాడు. హత్య చేసాక ఆభరణాలు, ఇంట్లో వెండి వస్తువులను తీసేసి.. ఏమి తెలియనట్లు ఆఫీస్ కి వెళ్ళిపోయాడు. ఆ తరువాత కిరాణా షాప్ ఓనర్ కి ఫోన్ చేసాడు. ఈ హత్య గురించి తనకు తెలియనట్లు వ్యవహరించాడు. పోలిసుల విచారణ లో ఈ నిజాలు బయటకు రావడం తో ఈ ఘటన అక్కడ కలకలం రేపింది.