పెళ్లి అయిన 8 సంవత్సరాల తర్వాత భార్యకు సర్ప్రైజ్ ఇచ్చిన భర్త…7 ఏళ్ల కూతురు సాక్షిగా..!

పెళ్లి అయిన 8 సంవత్సరాల తర్వాత భార్యకు సర్ప్రైజ్ ఇచ్చిన భర్త…7 ఏళ్ల కూతురు సాక్షిగా..!

by Mohana Priya

Ads

భార్య భర్తల బంధం అనేది ఎంతో అపురూపమైనది. ఎన్ని కష్టాలు వచ్చినా ఒకరితో ఒకరు తోడుంటూ జీవితాన్ని కొనసాగించడమే నిజమైన భార్య భర్తల సంబంధం.

Video Advertisement

ఇలాంటిదే ఒక కథ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అతనికి వచ్చిన కొద్దిపాటి ఆదాయంతోనే భార్యను ఉన్నత చదువులు చదివించారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య ఏదో విషయం మీద దిగులుగా ఉందనే విషయాన్ని గమనించాడు. తమ 8 వ పెళ్లి రోజు కానుకగా ఒక అద్భుతమైన బహుమతిని భార్యకు ఇచ్చి  ఆశ్చర్యపరిచాడు

అనీష్  ఒక ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తుండగా రజితను ప్రేమించాడు. పెద్దలను ఒప్పించి వివాహం చేసుకుందామని వీరిరువురు నిర్ణయించుకున్నారు. అనీష్ కుటుంబం వారు ఒప్పుకున్నా, రజిత కుటుంబ వారి పెళ్ళికి నిరాకరించారు.

చివరకు రజిత కుటుంబవారు ఒక షరతు మీద వీరి పెళ్లి జరగడానికి ఒప్పుకున్నారు. ఎలాంటి పెళ్లి ఆచారం లేకుండా కట్టుబట్టలతో తీసుకెళ్ళమని అనీష్ కుటుంబాన్ని కోరారు. వరుడు అనీష్ బంధువులు మరియు స్నేహితుల సమక్షంలో చాలా సాధారణంగా డిసెంబర్ 29 2014 లో  వివాహం చేసుకున్నారు.

అనీష్ కి వచ్చే కొద్దిపాటి ఆదాయంతోనే రజితను ఉన్నత చదువులు చదివించారు. భర్త ఆసరాతో రజిత కామర్స్ లో పీహెచ్డీ చదువులు పూర్తి చేసింది. ప్రేమించి ఇష్టపడి పెళ్లి చేసుకున్నా అనీష్, భార్యలో ఏదో అసంతృప్తి కల్పిస్తున్నట్లు గమనించాడు. ఏదైనా పెళ్లి వేడుకలో పాల్గొన్న భార్య మొహంలో ఒక చింత కనిపించేది అనీష్ కి.  తమ పెళ్లి అంత సాదాసీదాగా జరిగిపోవడం విధిరాత అని అనుకుంటూ ఉండేది రజిత.

రజిత కి వధువుగా అలంకరించుకోవాలి అనే కోరిక ఉండేది. వారి పెళ్లి రోజున తీసిన ఫోటోలు వీడియోలులో రజిత అన్నిటిలోనూ విచారంగానే కనిపించింది. ఇది చూసిన అనీష్ కు ఎంతో బాధగా అనిపించి తమ 8వ పెళ్లి రోజును వారే ఎప్పటికీ మర్చిపోకూడదు అని నిర్ణయించుకున్నాడు అనీష్.

తమ 7 ఏళ్ల కుమార్తె అమ్ము సాక్షిగా పెళ్లినాటి ప్రమాణాలు చేస్తూ వెడ్డింగ్ ఫోటోషూట్ ను ఏర్పాటు చేశారు. అనీష్ రజిత వధూవరులుగా ముస్తాబయ్యారు. అట్టుకల్ దేవాలయం, శంకుముఖం బీచ్ తో సహా అనేక ప్రదేశాలలో ఫోటోషూట్ జరిగింది. ఈ ఫోటోలు డిజిటల్ ఆల్బమ్ గా మారింది. ఈ సారి ఫోటోలో ప్రత్యేకత ఏంటంటే “రజిత ముఖం చిరునవ్వుతో” వెలిగిపోయింది. భార్య కలను నెరవేర్చిన ఈ భర్త ఎంత గొప్పవాడో కదా..

ALSO READ : VARALAKSHMI VRATHAM 2023: వరలక్ష్మీ వ్రత విధానం మరియు విశిష్టత..!


End of Article

You may also like