మనిషికి జుట్టు రాలిపోవటం ఒక సమస్యతే, జుట్టు నెరిసిపోవటం.. తెల్లబడటం కూడా పెద్ద సమస్యే. చిన్న వయసులో జుట్టు నెరిసిపోవటం వలన పెద్దవారిలా కనిపిస్తారు. దీనికి ఎన్నో కారణాలు ఉన్నాయి. అయితే వీటిని తగ్గించుకునేందుకు పరిష్కార మార్గాలు వెతుకుతారు.

Video Advertisement

అయితే తాజాగా తన భార్యకు తెల్ల జుట్టు వచ్చిందని.. ఆమె భర్త మరో పెళ్ళికి సిద్ధపడ్డాడు. దీంతో ఈ విషయం తెలుసుకున్న అందరు షాక్ అవుతున్నారు. తాజాగా దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

husband tries to get married again as wife gets white hair

వివరాల్లోకి వెళ్తే.. బీహార్‌లోని సారణ్ జిల్లాలోని సహజిత్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న బబితా దేవికి బనియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లౌవా కాలా నివాసి పంకజ్ సాహ్‌తో రెండేళ్ల క్రితం వివాహం జరిగింది. పెళ్లయిన కొద్ది రోజులకే భార్యాభర్తల మధ్య మనస్పర్థలు వచ్చాయి. అయితే ఇంటి పెద్దలు ఇరువురి మధ్య సయోధ్య కుదిర్చారు. అయితే పెళ్లయిన రెండేళ్ల తర్వాత భార్యకున్న తెల్ల జుట్టును చూసిన భర్త పంకజ్ ఇంట్లో గొడవలు రేపాడు. ఈ విషయమై ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీనిపై సహజిత్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో బబిత ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చారు.

husband tries to get married again as wife gets white hair

అయితే తాజాగా తన భర్త పంకజ్ మరో పెళ్లికి సిద్ధమయ్యాడు. స్థానికులు బబితకు ఈ విషయం తెలియజేయడంతో తన తండ్రితో కలసి ఆలయానికి చేరుకుని రచ్చ చేసింది. ఈ సందర్భంగా ఇరు కుటుంబాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దారు. బాధిత మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.