గత వారం రోజులుగా నగరవాసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న ‘చిరుత’..ఈరోజు మళ్ళీ ప్రత్యక్షం అయ్యింది.రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం హిమాయత్‌సాగర్‌ ఒడ్డున ఉన్న జీవీకే గార్డెన్స్‌లోని స్విమ్మింగ్ పూల్ లో నీళ్లు తాగుతూ ఉండటం గమనించిన వాచ్ మాన్.తక్షణం ఉన్నత అధికారులకి సమాచారం చేరవేసాడు..హుటా హుటిన వారు ఆ ప్రాంతానికి చేరుకుని గార్డెన్ లో కుక్కలని వదిలి చిరుతని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.ఒక మేక ని కూడా ఎర గా వదిలారు.

Video Advertisement

leopard-file photo

కొన్ని రోజుల క్రితం ఆ చిరుత ఒక లారీ డ్రైవర్ మీద దాడి చేస్తూ జరిగిన సంఘటన మనం చూసాం..ఈ నెల 14 న హైదరాబాద్ నగర శివారు ప్రాంతం అయినా కాటేదాన్ అండర్ బ్రిడ్జి పై తిరుగుతూ కనపడిన సంఘటన మనం చూసాం.కానీ అటవీ శాఖ అధికారులు దానికి మత్తు మంది ఇచ్చిలోపు తప్పించుకు పోయింది,వ్యవసాయ యూనివర్సిటీ లో దట్టమైన పొదలలోకి వెళ్ళిపోయింది దీని ఆచూకీ కోసం ఇప్పటి దాకా వెతుకుతూనే ఉన్నారు