తెలంగాణాలో ఎక్కువ చావులు దాని వల్లే అంట..! ఎందరో ఆడబిడ్డలు ఒంటరవ్వాల్సి వస్తుంది.?

తెలంగాణాలో ఎక్కువ చావులు దాని వల్లే అంట..! ఎందరో ఆడబిడ్డలు ఒంటరవ్వాల్సి వస్తుంది.?

by Anudeep

Ads

ఈ మధ్య కాలంలో ఫేస్ బుక్లో ఒక క్యాంపెయిన్ జరుగుతుంది “దావత్ వితవుట్ దారు” అని . మందు లేకుండ దావత్ ఏంది అని మొదట్లో ఇదేం క్యాంపెయిన్ రా అనిపించింది. కానీ ఆ క్యాంపెయిన్ స్టార్ట్ చేసిన సంధర్బం తెలుసుకుని మొదట బాధేసింది. తర్వాత ఎలా అయినా ఈ సారి దావత్ చేస్కుంటే దారుకి దూరంగా ఉండాల్సిందే అనే నిర్ణయం తీసుకోవాలనిపించింది.

Video Advertisement

నేడు జరిగే ఎన్నో అనర్దాలకు కారణం మధ్యపానం . మద్యం మత్తులో ఏం చేస్తున్నారో సోయి కూడా ఉండదు. ఎన్నో అత్యాచారాలు, యాక్సిడెంట్లూ వీటన్నింటికి కారణం మద్యమే. మూడేళ్ల క్రితం హైదరాబాద్ లోని పంజాగుట్ట ఫ్లైఓవర్ పై ఒక యాక్సిడెంట్ జరిగింది. ఆ యాక్సిడెంట్లో రమ్య అనే చిన్నారి చనిపోయింది. ఆ యాక్సిడెంట్ జరగడానికి మెయిన్ రీజన్ మధ్యం. మద్యం మత్తులో ఉన్న మైనర్ కుర్రాళ్లు స్పీడ్ గా కారు డ్రైవ్ చేస్కుంటూ వెళ్లి మరో కారుపై పడడంతో రమ్యతో పాటు తన కుటుంబసభ్యులు ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.

నగరం నడిబొడ్డులో జరిగిన ఆ యాక్సిడెంట్ అప్పట్లో సంచలనం సృష్టించింది. ఆ యాక్సిడెంట్ తర్వాత పుట్టిందే “దావత్ వితవుట్ దారు” క్యాంపెయిన్ . సోషల్ మీడియాలో వచ్చిన మరో వార్త చదివాక ఈ క్యాంపెయిన్ ఆవశ్యకత చాలా అవసరం ఉందనిపించింది.

దేశంలో అన్ని రాష్ట్రాల కంటే తెలంగాణాలోనే వితంతువుల సంఖ్య అధికం అని , అది కూడా వారి భర్తల చావుకి కారణం మధ్యం అనేది దాని సారాంశం . బంగారు తెలంగాణా వస్తే భవిష్యత్ ఉంటుందనుకుంటే , ఎందరో ఆడబిడ్డలకు జీవితమే లేకుండా పోతోంది. ఒకసారి ఆలోచించండి ఒక ఇంటి పెద్ద , అది కూడా మధ్య తరగతి కి చెందిన కుటుంబ పెద్ద మద్యానికి చనిపోతే ఆ కుటుంబం పరిస్తితి ఏంటి?

ఇంట్లో సంపాదించే వాడు లేకపోతే కుటుంబం రోడ్డున పడుతుంది. పిల్లలు చదువులు మానేసి చిన్నా చితకా పనులు చేస్కోవాల్సిన పరిస్థితి. దీని వల్ల క్రైమ్ రేట్ పెరుగుతుంది. కాబట్టి తెలంగాణాలో లిక్కర్ పాలసి పట్ల గవర్నమెంట్ దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఫ్రెండ్స్ చెప్పండి దావత్ వితవుట్ దారూ.


End of Article

You may also like