Ads
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అన్నిటికంటే ఖరీదైనది వైద్యమే. మాములుగా వచ్చే జ్వరం వంటి జబ్బులకే అయ్యే ఖర్చుని లెక్కలేసుకునే రోజులు ఇవి. ఇక కరోనా అంటే ఆ ఖర్చు మామూలుది కాదు. అలాంటి పరిస్థితుల్లో ఓ డాక్టర్ రూ. 10కె వైద్యం అందిస్తున్నారు. తన దగ్గరకు వచ్చే నిరుపేదలకు కేవలం ఒక కప్పు టీ తాగే ఖర్చు తోనే వైద్యం అందేలా చేస్తున్నాడు. మందుల్లో పది శాతం, టెస్ట్ లలో మరో ముప్పై శాతం రాయితీ వచ్చేలాగా చేస్తున్నాడు.
Video Advertisement
డా. విక్టర్ ఇమ్మాన్యుయేల్ హైదరాబాద్ లోని పీర్జాదిగూడ లో నివాసం ఉంటున్నారు. ఆయన గత నాలుగేళ్లుగా ప్రజ్వల క్లినిక్ ను నిర్వహిస్తూ వస్తున్నారు. ఆయన క్లినిక్ కి వచ్చే నిరుపేదలకు కేవలం పది రూపాయలకే చికిత్స చేస్తారు. డబ్బులు ఇవ్వగలిగిన వారివద్ద కన్సల్టేషన్ కింద కేవలం 200 రూపాయలను తీసుకుంటారు. బయట ఆసుపత్రిలలో డాక్టర్లను కలవడానికి 500 నుంచి 1500 చెల్లించాల్సిన పరిస్థితి ఉంది. కానీ, ఈరోజుల్లో ఇలా వైద్యం అందిస్తున్న ఇమ్మాన్యుయేల్ ను అందరు ప్రశంసిస్తున్నారు.
End of Article