Ads
తెలంగాణలో గణపతి ఉత్సవాలకు ప్రత్యేకత ఉంది. ఇండియాలో భారీగా గణేష్ ఉత్సవాలు జరిగేది ముంబైలో ఆ తరువాత హైదరాబాద్‌లోనే. లక్షలాది వినాయకుడి విగ్రహాలను చవితినాడు ప్రతిష్టించి, నవరాత్రులు భక్తి నిష్టలతో గణపతికి పూజలు చేస్తారు. నవరాత్రుల తర్వాత వినాయకుడిని నిమజ్జనం చేస్తారు.
Video Advertisement
హైదరాబాద్ లో ట్యాంక్ బండ్ పరిసరాల్లో వినాయక నిమజ్జనం చూడటానికి లక్షలాది భక్తులు వస్తారు. ఇక గణేష్ నిమజ్జనంలో యూత్ చాలా ఉత్సాహంగా పాల్గొంటారన్న విషయం తెలిసిందే. అయితే తాజాగా జరిగిన గణేష్ నిమజ్జనంలో కొందరు చేసిన పనుల వల్ల భక్తులు ఇబ్బందిపడ్డారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
వినాయకచవితి వేడుకలను భక్తులు ఘనంగా జరుపుకున్నారు. గణేష్ నిమజ్జన సందర్భంగా జరిగే ఊరేగింపులో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీస్ అధికారులు ప్రతి ఏడాది మందు షాపులను క్లోజ్ చేస్తూ ఉంటారు. ఎప్పటిలానే ఈ సంవత్సరం కూడా 3 రోజుల పాటు అంటే 26, 27, 28 మందు షాపులను మూసేయాలని తెలంగాణ గవర్నమెంట్ ఉత్తర్వులు ఇచ్చింది. అంటేకాకుండా మద్యం సేవించి నిమజ్జంలో పాల్గొనటాన్ని కూడా నిషేధించారు.
అయితే కొందరు మందు షాప్స్ మూసేస్తారని 3 రోజుల ముందుగానే మద్యాన్ని కొని, పెట్టుకున్నారు. అక్కడితో ఆగకుండా గణేష్ నిమజ్జంలో భాగంగా జరిగే ఊరేగింపులో కొందరు మద్యం సేవించారు. అది కూడా పబ్లిక్ గా అందరూ చూస్తుండగానే మద్యం సేవించారు. ఇలా చాలా చోట్ల కనిపించింది. గణేష్ నిమజ్జనం సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. అయినప్పటికీ హుస్సేన్‌సాగర్‌లో జరిగిన నిమజ్జనంలో చైన్ స్నాచింగ్‌లు, పిక్ పాకెటింగ్, మొబైల్ ఫోన్ల దొంగతనాలు పెద్ద సంఖ్యలో జరిగాయి.
గురువారం నాడు ఒక్కరోజే ఆ పరిసరాలు 67 దొంగతనాల కేసులు రిజిస్టర్ అయినట్టుగా తెలుస్తోంది. ప్రజలందరు గణేష్ నిమజ్జనం చూస్తుంటే, జేబు దొంగలు తమ చేతివాటాన్నిప్రదర్శించారు. ఈ దొంగతనాల పై పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు. డ్రోన్ దృశ్యాలు, సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా దొంగలను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
Also Read: సుప్రీం కోర్ట్ లోనే మొదటిసారి ఇలా… అసలు విషయం తెలిస్తే ఆమెకి హ్యాట్సాఫ్ అనాల్సిందే.!
End of Article