గుడ్ న్యూస్: కరోనాకి వాక్సిన్ కనుగొన్న హైదరాబాద్ ప్రొఫెసర్..! ఇంతకీ ఆమె ఎవరంటే?

గుడ్ న్యూస్: కరోనాకి వాక్సిన్ కనుగొన్న హైదరాబాద్ ప్రొఫెసర్..! ఇంతకీ ఆమె ఎవరంటే?

by Anudeep

Ads

ఎంత డబ్బు సంపాదించాలి? ఏం వెరైటీలు తినాలి? ఏ వస్తువులు కొనాలి? ఏ కోర్సులు చదవాలి? ఏ ఉద్యోగం చేయాలి?   ఇలా రకరకాలుగా  ఆలోచించే మనుషులంతా ఇప్పుడు ఒక్క విషయం గురించే ఆలోచిస్తున్నారు. యావత్ ప్రపంచం ఎదురు చూసేలా చేసినా ఆ విషయం ఏంటంటే కరోనా కి వ్యాక్సిన్ ఎప్పుడు కనుగొంటారు? మన మళ్లీ మామూలు జీవితం ఎప్పుడు గడుపుతాం? పగలు , రాత్రి ఇదే టెన్షన్ . డాక్టర్లు, శాస్త్రవేత్తలు అదే పనిలో తలమునకలయి ఉన్నారు.. ఎట్టకేలకు మన హైదరాబాద్ ప్రొఫెసర్ కరోనా కి వ్యాకసిన్ కనుగొన్నారు.

Video Advertisement

ఏదైనా వైరస్ కి వ్యాక్సిన్ కనుగొనడానికి సుమారు అయిదారేళ్ల టైం పడుతోంది.. వ్యాక్సిన్ కనుగొనడం దానికి అనుమతి రావడం, క్లినికల్ ట్రయల్స్ ఇలా అనేక రకాల తంతుల మధ్య వ్యాక్సిన్ విడుదల చేయబడుతుంది. కాని ఇప్పుడు  ఉన్న పరిస్థితుల్లో ఎంత లేదన్నా ఒకట్రెండు ఏళ్లు అయితే పట్టొచ్చని అంచనా . కాని యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ (HCU) కి చెందిన ప్రొఫెసర్ సీమా మిశ్రా కరోనాని నివారించేందుకు వ్యాక్సిన్ కనిపెట్టారు.. ఈ విషయాన్ని స్వయంగా HCU నే ప్రకటించింది.

హెచ్‌సీయూలో బయో కెమిస్ట్రీ విభాగంలో పని చేసే ప్రొఫెసర్ సీమా మిశ్రా దీన్ని తయారు చేసారు. ఆ వ్యాక్సిన్ కి టీ-సెల్ ఎపిటోమ్ అని పేరు కూడా పెట్టారు. ఏ వ్యాక్సిన్ కూడా కనిపెట్టగానే ఉపయోగంలోకి రాదు , అనేక టెస్టుల తర్వాత దానిని అమలులోకి తీసుకొస్తారు. ప్రస్తుతం టీ – సెల్ ఎపిటోమ్ కూడా టెస్టింగ్ స్టేజ్ లో ఉంది. మరిన్ని పరిశోదనలు చేస్తే ఇది అమలులోకి వచ్చేది లేనిది తెలుస్తుంది.  అందులో భాగంగా ఈ అధ్యనాన్ని కెమ్ రిక్సివ్ అనే జర్నల్ కి పంపారు.

సీమా మిశ్రా కనిపెట్టిన వ్యాక్సిన్ మనిషి శరీరంలో కరోనా వైరస్ ను మాత్రమే చంపేస్తుందని, ఆరోగ్యవంతంగా ఉన్న మరే ఇతర కణాలను అది హాని చేయదని  యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ తన ప్రకటణలో వెల్లడించింది. ఇప్పటి వరకు సరైన మందు లేని కారణంగా రకరకాల మందుల్ని ప్రయోగిస్తూ ఫలితాలు పొందుతున్నాయి..ఈ సమాచారాన్ని అంతర్జాతీయంగా దేశాలన్ని శేర్ చేసుకుంటున్నాయి.

వాక్సిన్ అందుబాటులోకి వస్తే సమస్య ఒక కొలిక్కి వస్తుంది. ఒక వేళ ఈ వ్యాక్సిన్ కనుక సక్సెస్ అయితే ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న వైరస్ ని ఓడించిన ఘనత మన భారత్ కే చెందుతుంది. మానవాళి మనుగడ కోసం అయినా వాక్సిన్ పరిశోధనలు సక్సెస్ కావాలని తొందరలో అందుబాటులోకి రావాలని కోరుకుందాం.

image source: 1


End of Article

You may also like