హైదరాబాద్ వ్యాపారుల కీలక నిర్ణయం…!

హైదరాబాద్ వ్యాపారుల కీలక నిర్ణయం…!

by Anudeep

Ads

ఇండియా చైనా బోర్డర్ లోని గాల్వన్ లోయలో ఇరు దేశాల సైనికుల మధ్య ఘర్షణలో భారతీయ సైనికులు మరణించటం యావత్ భారతావని దిగ్బ్రాంతికి లోనయ్యింది.చైనా చేసిన బూటకపు దాడి మీద యావత్ భారతావని కోపంగా ఉంది.చైనా మీద ప్రతీకార చర్యకు ఎదురు చూస్తుంది.ప్రధాని మోడీ కూడా స్పందిస్తూ భారత్ శాంతిని కోరుకుంటుంది కానీ..ఇలాంటి దొంగ దాడి ని సహించేది లేదు తిరిగి ధీటైన సమాధానం ఇస్తాము అంటూ జవాబు ఇచ్చారు.దీనితో బాయికాట్ చైనా ఉద్యమం ఊపందుకుంది.

Video Advertisement

మరో వైపు చైనా ప్రొడక్ట్స్ అన్నింటిని బ్యాన్ చేయాలనీ సోషల్ మీడియా లో నెటిజన్స్ బలంగా కోరుకుంటున్నారు.అంతే కాదు మనం చైనా ప్రొడక్ట్స్ కొని.వాడికి డబ్బు సంపాదించి పెట్టి మన సైనికులనే చంపుకుంటామా ? అని కామెంట్స్ చేస్తున్నారు.ఇప్పటికే చైనా వారి టిక్ టాక్ భారత్ లో విపరీతమైన క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే.ఇప్పుడు భారతీయ వ్యాపారాలు కూడా చైనా వస్తువులు బ్యాన్ చేయాలనీ నిర్ణయించుకున్నారు..

మన హైదరాబాద్ లోని అంబర్ బజార్,బేగం బజార్,ఫీల్ ఖానా లోని వ్యాపారస్తులు గురువారం ఈ నిర్ణయం తీసుకున్నారు.చైనా ఉత్పత్తులని ఏ మాత్రం ఇక మీదట అమ్మవద్దు అనే నిర్ణయానికి వచ్చారు.ప్రజల్లో ఇప్పుడిప్పుడే బాయికాట్ చైనా ఉద్యమం ఒప్పందుకున్నటు కనబడుతుంది.ప్రజల్లో ఇలాంటి చైతన్యం రావడం మంచిదే గా అంటూ నెటిజన్స్ అభిప్రాయ పడుతున్నారు.

మరో వైపు కరోనా పై యుద్ధం లో హైద్రాబాద్ వ్యాపారస్తులు తమ వంతు పాత్ర ను పోషిస్తున్నారు ఎలా అంటే  నగరం లో కరోనా కేసులు పెరిగిపోతూ ఉండటం తో ఒక కొత్త నిర్ణయానికి వచ్చారు అదేమిటంటే షాపులు కేవలం ఉదయం 9 నుంచి మధ్యాన్నం 3 వరకు మాత్రమే తెరిచి ఉంచాలనే నిర్యానికి వచ్చారంట.ఇలా స్వచ్చందంగా ప్రభుత్వాలకి సహకరించటం మంచిదే కదా.

 

 


End of Article

You may also like