తన భర్త ఆర్మీ ఆఫీసర్ గా పని చేస్తున్నాడు కాబట్టి ఇంట్లో లేనప్పుడల్లా డ్యూటీ నిమిత్తం బోర్డర్ వద్ద ఉంటున్నాడు అని భావిస్తూ సంసారం లాక్కొచ్చింది ఓ భార్య. తీరా తన భర్త తనకు తెలియకుండా మరో పెళ్లి చేసుకున్నాడని తెలుసుకుని షాక్ అయింది. తన భర్తని వెతుకుతూ.. మరో భార్య వద్దకు వెళ్లే సరికి.. తన భర్త కి మొదట మరో వివాహం కూడా అయింది అని తెలిసింది. తనకు తెలియకుండా మరో రెండు పెళ్లిళ్లు చేసుకున్నాడు అని తెలుసుకుని షాక్ అయ్యి.. పోలీసులను ఆశ్రయించింది.

shalini 1

హైదరాబాద్ లో ఉంటున్న రెండో భార్య షాలిని తన భర్త చేసుకున్న రెండు వివాహాల గురించి తెలుసుకుని.. పోలీసులను ఆశ్రయించడం తో.. ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే, మనీష్ శంకర్ అనే వ్యక్తి భారత ఆర్మీ లో పని చేస్తున్నారు. మనీష్ కు మొదట మౌనిక అనే అమ్మాయితో వివాహం అయింది. అయినప్పటికీ.. ఆమెకు తెలియకుండా షాలిని అనే మరో అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. మౌనిక హర్యానా లోని పానిపట్ లో ఉండేది.

shalini 2

షాలిని హైదరాబాద్ లో ఉంటోంది. మనీష్ శంకర్ ఇద్దరు అమ్మాయిలతో.. ఒకరికి తెలియకుండా మరొకరితో సంసారం నెట్టుకొచ్చాడు. భర్త ఇంట్లో లేనప్పుడల్లా విధుల నిమిత్తం వెళ్ళాడేమోనని షాలిని భావించేది. కొన్నేళ్లు గడిచిపోయాయి. షాలిని కి కూడా ఇద్దరు పిల్లలు పుట్టారు. ఈ క్రమం లో షాలిని కి భర్త చాందిని అన్సారీ అనే అమ్మాయితో మరో వివాహం చేసుకున్నాడని తెలిసి నిలదీయడం కోసం మీరట్ లో ఉంటున్న ఆమె వద్దకు వెళ్ళింది. తీరా అక్కడకు వెళ్ళాక.. ఆమె కు మొదటి భార్య గురించి కూడా తెలిసింది.

shalini 3

తనతో కాపురం చేస్తూ.. తనకంటే ముందు ఒక అమ్మాయిని.. తనని చేసుకున్న తరువాత మరో అమ్మాయిని కూడా పెళ్లి చేసుకున్నాడని తెలిసి షాలిని షాక్ అయింది. అక్కడి స్థానికుల సాయం తో మనీష్ పై పోలీస్ స్టేషన్ లో కేస్ పెట్టింది. తన భర్త ను కఠినం గా శిక్షించాలని కోరింది. షాలిని కి ఇద్దరు పసి పిల్లలు ఉన్నారు. ఆమెకు ఎలాంటి అన్యాయం జరిగిందో కూడా అర్ధం కాని పసి వయసు వారిది. ఆమె ఆవేదన చూసి స్థానికులు కన్నీళ్లపర్యంతమవుతున్నారు.