ఇంత గొప్ప ఎలివేషన్ ఇచ్చారు అనుకున్నాం..! కానీ ఇది ఒరిజినల్ కాదా..?

ఇంత గొప్ప ఎలివేషన్ ఇచ్చారు అనుకున్నాం..! కానీ ఇది ఒరిజినల్ కాదా..?

by kavitha

Ads

మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా, మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం భోళాశంకర్‌. ఈ మూవీ ఆగస్ట్ 11న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ ను ఇటీవల గ్రాండ్‌గా నిర్వహింహచారు.

Video Advertisement

హైదరాబాద్‌లో జరిగిన ఈ వేడుకకు భోళాశంకర్‌ మూవీ యూనిట్‌తో పాటుగా తెలుగు ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు హాజరయ్యారు. ఈ వేడుకలో కమెడియన్ హైపర్ ఆది రామ్ చరణ్ పై చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కానీ ఇదే విషయాన్ని ఒక ట్విట్టర్ యూజర్ 3 ఏళ్ల క్రితమే చెప్పారట. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
మెగాస్టార్‌ చిరంజీవి నటించిన భోళాశంకర్‌ మూవీలో తమన్నా, కీర్తి సురేష్ హీరోయిన్లుగా నటించగా, సుశాంత్ కీలక పాత్రలో నటించారు. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం నాడు జరుగగా,  కమెడియన్ హైపర్ ఆది ఇచ్చిన స్పీచ్ ఇంట్రెస్టింగ్ గా సాగింది. ఆది మెగా కుటుంబాన్ని విమర్శించేవారికి తనదైన ప్రాస, పంచ్‌లతో సమాధానం చెప్పాడు.  సహజంగా హీరోలకు అభిమానులు ఉంటారు. కానీ మెగాస్టార్ చిరంజీవికి మాత్రం హీరోలే అభిమనులుగా ఉంటారని అన్నారు. ఆది తన పంచ్ లతో మెగా అభిమానులకు గూస్‌ బంప్స్‌ తెప్పించాడు.
comments on this point in bholaa shankar teaserహైపర్‌ ఆది ఈ ఈవెంట్ లో పవన్‌ కల్యాణ్‌, రామ్‌ చరణ్‌ల గురించి కూడా మాట్లాడాడు. రామ్‌ చరణ్‌ గురించి చెబుతూ ‘ సచిన్‌ టెండూల్కర్ కొడుకు సచిన్‌ టెండూల్కర్ అవలేదు. అమితాబ్‌ బచ్చన్ కొడుకు అమితాబ్‌ బచ్చన్ అవలేదు. కానీ చిరంజీవిగారి కొడకు చిరంజీవి అయ్యాడు అంటూ ఆద్యంతం ఆసక్తికరంగా చెప్పుకొచ్చారు. అయితే ఇవే కామెంట్స్ మూడేళ్ళ క్రితం మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా విషెస్ తెలుపుతూ అనియన్ స్లైస్ అనే ట్విట్టర్ యూజర్ ట్వీట్ చేశారు.
హైపర్‌ ఆది భోళాశంకర్‌ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ లో ఈ కామెంట్స్ చేసిన తరువాత సదరు ట్విట్టర్ యూజర్ ‘ఈ ట్వీట్ మనం మూడున్నరేళ్ల క్రిందటే వేసాం’ అంటూ ఆ ట్వీట్ ని షేర్ చేయడంతో నెటిజెన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు.

Also Read: భోళా శంకర్ మరియు జైలర్ ని దాటేసిన ఆ హీరో సినిమా..? ఇదెక్కడి వింత..?


End of Article

You may also like