Ads
2002 లో మాస్ మహారాజా రవితేజ – పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో వచ్చిన ఇడియట్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టారు రక్షిత. రక్షిత అసలు పేరు శ్వేత. 2002 లో ఇడియట్ సినిమాని కన్నడలో అప్పు పేరుతో రూపొందించారు. ఒక రకంగా చెప్పాలంటే ఇదే రక్షిత మొదటి సినిమా. ఈ సినిమాకి పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించారు. పునీత్ రాజ్ కుమార్ హీరోగా నటించారు.
Video Advertisement
అప్పు సినిమాని కన్నడ స్టార్ నటులు రాజ్ కుమార్ గారి భార్య పార్వతమ్మ రాజ్ కుమార్ గారు నిర్మించారు. ఆవిడ శ్వేతకి రక్షిత అనే పేరు పెట్టారు. అలా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు రక్షిత. ఆ తర్వాత శింబు హీరోగా తమిళంలో కూడా రీమేక్ అయ్యింది. దమ్ పేరుతో రూపొందిన ఈ రీమేక్ కి, ఏ. వెంకటేష్ దర్శకత్వం వహించారు. ఇందులో కూడా రక్షిత హీరోయిన్ గా నటించారు.
తర్వాత తెలుగులో పెళ్ళాం ఊరెళితే, నిజం, శివమణి, ఆంధ్రావాలా, జగపతి సినిమాల్లో నటించారు. అలాగే లక్ష్మీ నరసింహ, అందరివాడు సినిమాల్లో స్పెషల్ అప్పియరెన్స్ లో కనిపించారు. 2007 లో ఒక కన్నడ సినిమాలో చివరిగా నటించారు రక్షిత. అదే సంవత్సరం ప్రేమ్ అనే ఒక కన్నడ సినిమా డైరెక్టర్ ని పెళ్లి చేసుకున్నారు. 2012లో రాజకీయాల్లో చేరుతున్నట్లు ప్రకటించారు రక్షిత.
అయితే, రక్షిత నటనకు దూరం అయినా కూడా సినిమాలకు దూరం అవ్వలేదు. 2011 లో జోగయ్య అనే కన్నడ సినిమాని నిర్మించారు. ఆ తర్వాత డీకే, ద విలన్ అనే మరో రెండు సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు రక్షిత. ఇప్పుడు తన సోదరుడు అభిషేక్ రావు (రానా) హీరోగా వస్తున్న ఏక్ లవ్ యా అనే సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి ప్రేమ్ దర్శకత్వం వహించారు.
ఇందులో రీష్మ, రచిత రామ్ హీరోయిన్లుగా నటించారు. రక్షిత కూడా ఒక స్పెషల్ అప్పియరెన్స్ లో కనిపించబోతున్నారు. 2020 లో విడుదల కావాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా ఆలస్యం అయ్యింది. ఇప్పుడు ఈ సంవత్సరంలో ఏక్ లవ్ యా సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కేవలం కన్నడలో మాత్రమే కాకుండా తెలుగు, తమిళ్, మలయాళం భాషల్లో కూడా ఈ సినిమా విడుదల అవుతుంది.
End of Article