3-5 సెకండ్లలో కరోనాని గుర్తించవచ్చు…ఐఐటీ ప్రొఫెసర్ సరికొత్త ప్రయత్నం.

3-5 సెకండ్లలో కరోనాని గుర్తించవచ్చు…ఐఐటీ ప్రొఫెసర్ సరికొత్త ప్రయత్నం.

by Anudeep

Ads

కరోనాని గుర్తించాలంటే మనుషుల దగ్గర శాంపిల్స్ తీసుకుని వాటిని పూణెలోని వైరాలజి సంస్థకి పంపించి, రిజల్ట్స్ కోసం పదిపదిహేను రోజులు ఎదురుచూడాల్సిన పరిస్థితి. ప్రస్తుతం కోవిడ్-19 మరింత ఎక్కువగా వ్యాప్తి చెందుతున్న నేపధ్యంలో ప్రభుత్వం కూడా సత్వర చర్యలు చేపడుతూ టెస్టింగ్ ల్యాబ్స్ ను ఏర్పాటు చేశారు. వాటిల్లో కూడా రిపోర్ట్స్ రావడానికి టైం పడుతుంది. కాని కేవలం సెకన్లలో కరోనా సోకింది లేనిది గుర్తించవచ్చు అంటున్నారు రూర్కి ప్రొఫెసర్.

Video Advertisement

ఒక వ్యక్తికి తీసిన ఎక్స్‌రే ద్వారా రోగికి న్యూమోనియా లక్షణాలు ఉన్నాయా? లేదా? అనే విషయాన్ని గుర్తించడంతో పాటు అది కరోనాకు సంబంధించిందా? లేక ఇతర బ్యాక్టీరియా వల్ల వచ్చిందా? అనేది ఐదు సెకన్లలో గుర్తించవచ్చంటున్నారు ప్రొఫెసర్ కమల్ జైన్.సివిల్ ఇంజనీరింగ్ విభాగానికి చెందిన కమల్ జైన్ , ఈ సాఫ్ట్ వేర్ తయారుచేయడానికి 40రోజలు శ్రమించారు.. ఈ సాఫ్ట్ వేర్ ఉపయోగించి వైధ్యులు కేవలం 5సెకన్లలో కరోనా వైరస్ సోకింది లేనిది గుర్తించవచ్చంటున్నారు.

ఈ సాప్ట్ వేర్ అభివృద్ది చేయడానికి ఆయన 60వేల మంది కరోనా, న్యూమోనియా, క్షయ రోగులతో పాటు, ఇతర రోగుల ఎక్స్ రేలను పరిశీలించి. వాటి ద్వారా ఒక కృత్రిమ బేస్ ఆధారిత డేటాబేస్ ను అభివృద్ది చేశారు. దీని పైన పేటెంట్ హక్కుల కోసం ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్)కు దరఖాస్తు చేసినట్లుగా జైన్ తెలిపారు. అలాగే అమెరికాకు చెందిన ఎన్‌ఐహెచ్ క్లినికల్ సెంటర్ ఛాతిఎక్స్‌-రే డేటాబేస్‌ను కూడా విశ్లేషించానని చెప్పారు.

తాను రూపొందించిన ఈ సాప్ట్‌వేర్ పరీక్ష ఖర్చులను తగ్గడమే కాకుండా, కరోనా పేషెంట్స్ ని నేరుగా కాంటాక్ట్ అయ్యే వైధ్యులు ఈ వ్యాధి భారిన పడకుండా కాపాడుతుందని జైన్ అంటున్నారు.ఇదిలా ఉంటే  దేశంలో ఇప్పటి వరకు నమోదైన కరోనా పాజిటివ్ కేసులు 23 వేలు దాటింది. మరణాల సంఖ్య 718గా నమోదైంది..ఈ సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది. ప్రభుత్వాలు కూడా కరోనాని నియంత్రించడానికి ఉన్న అన్ని మార్గాలను అవలంభిస్తున్నారు. కమల్ జైన్ రూపొందించిన సాఫ్ట్వేర్  ప్రభుత్వ ఆమోదం పొంది అందుబాటులోకి వస్తే పరిస్థితి కొంతలో కొంత మెరుగ్గా ఉంటుండొచ్చు .


End of Article

You may also like