Ads
ఊపిరి సినిమా చూసారా..? అందులో శ్రీయ చరణ్ వేసిన పెయింటింగ్ ను హీరో నాగార్జున ఇరవై లక్షలు పెట్టి కొంటాడు. తీరా చూస్తే.. అందులో రెడ్ పెయింట్ తప్ప అందులో ఏమి కనిపించదు.. పెయింటింగ్ నాతొ మాట్లాడుతుంది అంటూ.. నాగార్జున కూడా ఆ పెయింటింగ్ ను మెచ్చుకుని అంత ఖరీదు పెట్టి కొనుగోలు చేస్తాడు. ఇలాంటి సీన్ రియల్ లైఫ్ లో కూడా జరిగింది. ఐతే ఇక్కడ అమ్ముడుపోయింది పెయింటింగ్ కాదు.. అదృశ్య శిల్పం. ఆ సినిమా లో కనీసం పెయింటింగ్ అంటే కనీసం రెడ్ పెయింట్ అయినా కనిపించింది.
Video Advertisement
కానీ.. ఇక్కడ అదేమీ లేదు. ఏమి కనిపించదు. కేవలం ఖాళీ.. శూన్యం అంతే. ఈ అదృశ్య శిల్పం ఇంతకు అమ్ముడుపోయిందో తెలుసా..? అక్షరాలా 15 వేల యూరోలకు.. అంటే ఇండియన్ కరెన్సీ లో పదమూడు లక్షలు. మనం నమ్మే దేవుడికి కూడా ఓ రూపం, ఆకారం లేదని.. ఈ శిల్పం ఉద్దేశ్యం కూడా అదేనని భావిస్తున్నారట. ఈ శిల్పాన్ని ప్రదర్శనకు ఉంచిన కళాకారుడు శాంటా గియుస్టాకు చెందినవాడు మరియు గత ఫిబ్రవరిలో మిలన్ లోని పియాజ్జా డెల్లా స్కాలాలో ప్రదర్శించిన “బుద్ధ ఇన్ ధ్యానంలో” తాను గతం లో ఇచ్చిన ప్రదర్శనకు మంచి పేరు పొందాడు.
End of Article