ఈ ఒక్క తప్పు వల్ల చాలామంది కరోనాకి బలైపోతున్నారు…దయచేసి జాగ్రత్తపడండి.!

ఈ ఒక్క తప్పు వల్ల చాలామంది కరోనాకి బలైపోతున్నారు…దయచేసి జాగ్రత్తపడండి.!

by Mohana Priya

కరోనా ఎప్పుడు ఎవరికి ఏ రకంగా వస్తుందో ఏమి చెప్పలేం. అందుకే అందరూ చాలా జాగ్రత్తగా ఉంటున్నారు. బయటికి వెళ్లి వచ్చిన తర్వాత చేతులు శుభ్రంగా కడుక్కోవడం, మాస్కు తప్పని సరిగా ధరించడం, ఎక్కడికి వెళ్ళినా తమతోపాటు శానిటైజర్ ని కచ్చితంగా తీసుకెళ్లడం.

Video Advertisement

అంతేకాకుండా మనిషికి మనిషికి మధ్య సామాజిక దూరం పాటించడం, ఆహార పదార్థాలను శుభ్రంగా కడుక్కుని తీసుకోవడం వంటి ఎన్నో జాగ్రత్తలు పాటిస్తున్నారు. కానీ కరోనా ని ఎదుర్కోవాలంటే వీటన్నిటితోపాటు ముఖ్యమైనది ఇంకొకటి ఉందట. అదే మనోధైర్యం.

కొంచెం దగ్గు జలుబు రాంగానే కరోనా వచ్చిందేమో అనే అనుమానం లో చాలామంది అతి జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. ఇంకా మానసికంగా కూడా చాలా బలహీనంగా అయిపోతారు. అసలు ఇంకా పాజిటివ్ అని రిపోర్టు రాకముందే వైరస్ ఎక్కడ నుంచి వచ్చిందో, ఇప్పటికే తమ నుండి ఎవరికైనా సోకింది ఏమో అని లేనిపోని అపోహలతో భయపడతారు. కానీ పరిస్థితిని ధైర్యంగా హ్యాండిల్ చేయడమనేది ఈ సమయంలో చాలా ముఖ్యమైన విషయమట.

జనాలు భయపడుతూనే పార్టీలకి, లేదా జనాలు ఉండే చోట్ల కి వెళ్తున్నారట. ముందుగా నియంత్రించాల్సిన విషయం అలా వెళ్లడమే. ఇప్పుడున్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని అలాంటి సోషల్ ఈవెంట్స్ కి వెళ్లకుండా కంట్రోల్ చేసుకోవాలి. అంతేకాకుండా ఒకవేళ క్వారంటైన్ లో ఉండమని సూచిస్తే చాలామంది భయపడుతున్నారట.

సోషల్ స్టిగ్మా, అంటే వాళ్లని వేరు చేసినట్టు ఫీల్ అవుతున్నారట. అలాంటి ఆలోచనలు మెదడులోకి రానీయకూడదట. క్వారంటైన్ అంటే మన ఇంట్లో మనం ఉండడం. మన ఇల్లు అంత అలవాటైన ప్రదేశం మనకి ఇంకొకటి ఉండదు. కాబట్టి ఇంట్లో ఉంటున్నప్పుడు స్వేచ్ఛగా, మెదడులోకి ఎలాంటి చెడు ఆలోచనలు రానీయకుండా ప్రశాంతంగా ఉండాలట.

కొంతమంది కరోనా లక్షణాలు కనిపించిన వాళ్ళు టెస్ట్ చేయించుకోవడానికి భయపడుతున్నారట. దానికి కారణం చుట్టుపక్కల వాళ్ళు తమ ని ఏమంటారో, అందరి నుండి వేరు చేస్తారేమో లాంటి అనుమానాలట.

ఇంకొంతమంది అయితే కరోనా పాజిటివ్ వస్తే హెల్త్ అథారిటీస్ వాళ్లకి ఇన్ఫార్మ్ చేయట్లేదట. దానికి కూడా మిగిలిన వాళ్లు తమను పట్టించుకోరు వేరుగా చూస్తారు అనే భావనే కారణమట.

అలాంటివన్నీ వదిలేసి వ్యాధి లక్షణాలు కనిపిస్తే ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి ఒకవేళ పాజిటివ్ వస్తే కచ్చితంగా ఇన్ఫార్మ్ చేయాలి.అంతేకాకుండా చుట్టుపక్కల ఉన్న వాళ్లు కూడా కరోనా పాజిటివ్ వచ్చిన వాళ్ళని తమ మాటలతో కానీ, పనులతో కానీ ఇబ్బంది పెట్టకుండా వాళ్లకు ఏమైనా కావాలి అంటే సహాయం చేయడం, లేదా ధైర్యం చెప్పడం చేయాలట.

వృద్ధులు, ఇంకా ముందే క్యాన్సర్, లేదా ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వాళ్లు అయితే ఆరోగ్యం కొంచెం పాడయినట్టు అనిపిస్తే వెంటనే డాక్టర్ దగ్గరకు వెళ్ళి పరీక్షలు చేయించుకోవాలట.

ఎక్కువ శాతం మందికి కరోనా పాజిటివ్ వచ్చినా కూడా మైల్డ్ గానే వస్తోందట. అంటే ఒకరోజు జ్వరం రావడం తర్వాత తగ్గిపోవడం, లేదా రెండు మూడు రోజులు జలుబు ఉండడం, కొంచెం దగ్గు రావడం తర్వాత తగ్గిపోవడం లాంటివట. ఇలా దాదాపు 70 నుండి 80 శాతం మందికి అవుతోందట.

కొంతమందికి మాత్రమే కరోనా పాజిటివ్ వచ్చిన తర్వాత సీరియస్ కండిషన్ ఉంటోందట. వాళ్లకి ఆక్సిజన్ ఏర్పాటు చేయడం, హాస్పిటల్లో చేర్చడం, వెంటిలేటర్ పై ఉంచడం అవసరమట. కరోనా పాజిటివ్ వచ్చినంత మాత్రాన అందరూ హాస్పిటల్ లో చేరాల్సిన అవసరం లేదట. ప్రపంచ వ్యాప్తంగా పోలిస్తే భారత దేశ ప్రజలకి రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉందట.

ఒకవేళ కరోనా పాజిటివ్ వచ్చినా కూడా తొందరగా రికవరీ అవుతుందట. సీరియస్ పరిస్థితులు వచ్చే అవకాశం చాలా తక్కువట. అంతే కాకుండా మిగిలిన దేశాలతో పోలిస్తే కరోనా వల్ల మరణించే వ్యక్తుల సంఖ్య భారతదేశంలోనే తక్కువగా ఉందట.

అందుకే ముందు కంగారు పడకుండా, ఎక్కువగా ఆలోచించకుండా ధైర్యంగా పరిస్థితులను ఎదుర్కోవాలి అని, ధైర్యం తో కరోనా నే కాదు ఇతర వ్యాధులను కూడా జయించవచ్చు అని, కాబట్టి ఆరోగ్య పరమైన జాగ్రత్తలతో పాటు మనోధైర్యం కూడా కచ్చితంగా ఉండాల్సిన విషయం అని డాక్టర్లు చెబుతున్నారు.

https://youtu.be/o6SjxL-KQzc


You may also like