Home News సినిమా రేంజ్ స్టోరీ..! ప్రియుడికి పెళ్లవుతోంది అని తెలిసి మాజీ లవర్స్ అందరూ కలిసి ఏం చేశారో తెలుసా..?

సినిమా రేంజ్ స్టోరీ..! ప్రియుడికి పెళ్లవుతోంది అని తెలిసి మాజీ లవర్స్ అందరూ కలిసి ఏం చేశారో తెలుసా..?

by Anudeep

ఈ రోజుల్లో చాలా జంటలు ప్రేమించుకున్నప్పటికీ ఆ బంధాన్ని పెళ్లి వరకు తీసుకెళ్లలేకపోతున్నారు. ఈ క్రమం లోనే తమను ప్రేమించి మోసం చేసారంటూ చాలా మంది పెళ్లి మండపాల వద్ద గొడవలు చెయ్యడం మనం చూసే ఉంటాం..అయితే తాజాగా చైనా లో జరిగిన ఘటన వీటన్నిటికీ భిన్నమైనది. ఓ యువకుడి తమను మోసగించాడని పేర్కొంటూ పలువురు యువతులు కళ్యాణ వేదిక వద్దకు చేరుకుని నిరసనకు దిగారు. అతడ్ని ఇంతటితో వదిలిపెట్టే ప్రసక్తేలేదని, జీవితాన్ని నాశనం చేస్తామంటూ మాజీ ప్రియురాళ్లు బ్యానర్లు ప్రదర్శించిన వీడియో వైరల్ గా మారింది.

నైరుతి చైనాలోని యున్నన్‌ ప్రావిన్సులకు చెందిన చెన్‌ అనే యువకుడికి ఫిబ్రవరి 6న వివాహం జరిగింది. ఈ సమయంలో పెళ్లిమండపం వద్ద కొందరు యువతులను చూసి చెన్ షాకయ్యాడు. వారంతా అతడి మాజీ ప్రియురాళ్లు. ‘మేం నీ మాజీ ప్రియురాళ్లం. ఈ రోజు మేమంతా కలిసి నీ జీవితాన్ని నాశనం చేస్తాం’ అని రాసి ఉన్న బ్యానర్‌ను పట్టుకుని రోడ్డుకు మధ్యలో వాళ్లు నిలబడ్డారు. దీంతో వివాహానికి వచ్చిన అతిథులు దీన్ని గమనించసాగారు.

girfriends protested at the marrige of their ex in chaina..!!

పెళ్లి మండపం ముందు నిరసన చేస్తున్న యువతులను చూసిన వధువు, ఆమె కుటుంబసభ్యులు.. దీని గురించి చెన్‌ని నిలదీశారు. ఆ యువతులంతా ఎవరు.. వారికి నీకు సంబంధం ఏంటి.. ఎందుకు నీ జీవితం నాశనం చేస్తామంటున్నారు అని ప్రశ్నల వర్షం కురిపించారు. ఇక చెన్‌ స్పందిస్తూ.. తాను గతంలో ప్రేమ పేరుతో వారితో కలిసి తిరిగానని అంగీకరించాడు. అప్పట్లో కుర్రతనం… విచక్షణ లేని కారణంగా చాలా మంది అమ్మాయిలను బాధ పెట్టానని.. వారే వీరు అని వెల్లడించాడు. అయితే ప్రస్తుతం తాను మారిపోయానని.. రిలేషన్‌ వాల్యూ తనకు తెలుసని చెప్పుకొచ్చాడు. తాను చేసిన పనికి క్షమాపణలు కోరాడు.

girfriends protested at the marrige of their ex in chaina..!!

ఈ సందర్భంగా చెన్‌ ‘‘అమ్మాయిలను మోసం చేయొద్దు.. వారితో నిజాయతీగా ఉండాలి.. ఒకవేళ భవిష్యత్తులో ఆమె ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకుంటే.. మీరు బలవుతారు’’ అపి సూచించాడు. అయితే, పెళ్లి సమయంలో తన మాజీ ప్రియురాళ్లు చేసిన పని తనని కాస్త ఇబ్బంది పెట్టిందని.. కాబోయే భార్య కూడా దీని గురించి తనతో పెళ్లి రోజు గొడవపడిందని ఆవేదన వ్యక్తం చేసాడు. ఈ సంఘటనపై నెటిజన్లు రకరకాలు స్పందిస్తున్నారు. అతడు చేసింది తప్పు.. దాన్ని క్షమించడం నేరం.. అంతమంది మహిళలను మోసం చేశాడు అంటే.. భవిష్యత్తులో ఇంక ఎంత మందిని మోసం చేస్తాడు అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు.

You may also like