Ads
ప్రేమికుల రోజు నాడే ప్రేమ జంట ప్రమాదవశాత్తు మరణించిన విషాద ఘటన గోవాలో జరిగింది. ఈ విషాద ఘటన మంగళవారం జరిగింది. ఇంట్లో చెప్పకుండా ప్రేమికుల రోజు సెలబ్రేట్ చేసుకోవడానికి గోవా వెళ్లిన ఓ ప్రేమ జంట అనుమానాస్పదరీతిలో బీచ్‌లో విగతజీవులుగా మారారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తర్ ప్రదేశ్‌కు చెందిన విభు శర్మ(27), సుప్రియా దుబే (26) బంధువులు. విభు శర్మ ముంబాయిలోని ఓ ప్రైవేట్ కంపెనీలో, సుప్రియా దుబే బెంగళూరులో ఉద్యోగాలు చేస్తున్నారు.
Video Advertisement
ఫిబ్రవరి 14న వాలంటైన్స్ డేను ఘనంగా సెలబ్రేట్ చేసుకోవాలనుకున్నారు. దీనికోసం సోమవారం ఇద్దరూ గోవా చేరుకున్నారు. దక్షిణ గోవా జిల్లా, క్యానకోనా తాలూకాలోని ఒక హోటల్లో బస చేశారు. సెలబ్రేషన్స్‌లో భాగంగా అక్కడి పాలోలెమ్ బీచ్‌కు వెళ్లారు. అనంతరం సోమవారం రాత్రి డిన్నర్ చేశారు. ఈ మేరకు సీసీ కెమెరాలలో రికార్డు అయ్యింది. ఆ తర్వాత బీచ్‌లో స్విమ్మింగ్‌కు వెళ్లారు. గత రెండు రోజులుగా పాలోలెమ్ బీచ్ పరిసర ప్రాంతాల్లో సుప్రియ, విభులను చూసినట్లు స్థానికులు సైతం తెలిపారు.
ఏం జరిగిందో.. ఏమో గానీ.. మంగళవారం ఉదయం 7 గంటల ప్రాంతంలో పలోలెం సమీపంలోని ఊరెమ్ బీచ్ స్ట్రెచ్ వద్ద మహిళ మృతదేహం లభ్యమైంది. ఆ ప్రదేశానికి కొద్ది దూరంలో మధ్యాహ్నం సమయానికి ఓ వ్యక్తి మృతదేహం కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతులను విభు, సుప్రియాలుగా గుర్తించారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
అయితే ఈ మేరకు హోటల్ సిబ్బందిని ప్రశ్నించారు పోలీస్ లు . విభు శర్మ, సుప్రియా దుబే సముద్రంలోకి వెళ్లే ముందు ఇద్దరూ డిన్నర్, డ్రింక్స్ తీసుకున్నట్లు హోటల్ సిబ్బంది తెలిపారు. అయితే, వీరి మృతికి మరేమైనా కారణాలున్నాయా అనే కోణంలో కూడా పోలీసులు విచారణ జరుపుతున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు కెనకోనా పోలీస్ స్టేషన్‌కు చెందిన ఓ సీనియర్ అధికారి తెలిపారు.
End of Article