Ads
ఇద్దరు స్నేహితులు దొంగతనానికి పక్కా ప్లాన్ వేసుకున్నారు. ప్లాన్ కు అనుగుణంగా అనుకున్నది చేయడానికి సిద్ధమయ్యారు. ఎంత తెలివైన దొంగ అయినా సరే ఎక్కడోచోట చిన్న తప్పు చేసి దొరికిపోవటం సహజమే. ఇప్పుడు ఈ ఇద్దరు స్నేహితులు కూడా అదే విధంగా ఎదురుదెబ్బలు తిన్నారు.
Video Advertisement
అసలు వివరాల్లోకి వెళితే ఇతర స్నేహితులు తమ ఈద్ పండుగ సెలబ్రేట్ చేసుకోవడానికి చేతిలో డబ్బులు లేకపోవడంతో దొంగతనం చేయాలని నిర్ణయించుకున్నారు. తమ ప్లాన్ ను అమలు చేయడానికి ఒక ప్రదేశాన్ని ఎంచుకున్నారు.
image source : TV 9 Telugu
హర్యానాలోని పల్వాల్ జిల్లా చందత్ గ్రామానికి చెందిన రాహుల్ అలియాస్ రాజా, కృష్ణ అలియాస్ రాహుల్ ఈద్ పార్టీ చేసుకునేందుకు డబ్బులు కోసం దారి దోపిడీకి ప్లాన్ వేశారు. అనుకున్నట్లుగానే స్థానిక రహదారిపై దోపిడీ చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. లిఫ్ట్ కోసం ఓ వాహనాన్ని ఆపి అందులోకి ఎక్కగానే బెదిరించి డబ్బులు లాక్కోవాలని ఐడియా వేశారు. వాళ్ళు అనుకున్న విధంగానే ఒక వాహనం రాగానే ఆపి లిఫ్ట్ కావాలంటూ అడిగారు. కారులోకి ఎక్కి చూడగానే ఇద్దరి ఫ్యూజులు కాస్త ఎగిరిపోయి చివరి ట్విస్ట్ అదిరిపోయింది.
ఇంతకీ వాళ్లు ఎక్కిన కారు క్రైమ్ బ్రాంచ్ పోలీసులది. వీళ్ల ఇద్దరి కదలికలు అనుమానంగా ఉండటంతో అసలు విషయం తెలుసుకొని ఇద్దరిని అరెస్టు చేసి దోపిడీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. రాజు మరియు కృష్ణాని కోర్టులో హాజరుపరచి జైలుకు తరలించారు. చివరికి వాళ్లు అనుకున్నది ఒకటి అయినది ఒకటి జరిగింది.
End of Article