సిటీలు సముద్రంలో మునిగిపోతున్నాయా !
భారతదేశంలో తీరప్రాంతాన్ని ఆనుకొని ఎన్నో సిటీలు నిర్మితమయ్యాయి అయితే ఇప్పుడు మానవులు చేస్తున్న తప్పిదాల వల్ల ఆ సిటీ లను సముద్రం ముంచేసే అవకాశం ఉందా అనే విషయం శాస్త్రవేత్తలను కలవరపెడుతోంది. ఈ విషయంపై భిన్నవాదనలు తలెత్తుతున్నాయి. రీసెంట్ గా ipcc ( ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్ ) ఇచ్చిన నివేదిక ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో సముద్ర తీరాన ఉండే సిటీలు రానున్న 80 సంవత్సరాలలో ముంపుకు గురయ్యే అవకాశం ఉంది అని తెలియజేసింది.

ఆ లిస్ట్ లో భారతదేశానికి సంబంధించిన 12 సిటీలు ముంపుకు గురయ్యే అవకాశం ఉందని తెలియజేసింది. ఈ ipcc అనే సంస్థను వరల్డ్ మెట్రోలాజికల్ ఆర్గనైజేషన్ (wmo) మరియు యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రాం రెండూ కలిసి సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి.భారతదేశంలో ఉన్న సిటీలలో విశాఖపట్నం, కొచ్చిన్, ముంబై మొదలగున్న పట్టణాలు ఉన్నాయి ఉన్నాయి. అయితే సముద్ర తీర ప్రాంతం తరుగుదల అనేది చాలా స్వల్ప మొత్తంలో ఉంటుందని దాని గురించి భయపడవలసిన అవసరం లేదని కొంతమంది శాస్త్రవేత్తలు చెప్తున్నారు అయినప్పటికీ ఇటీవల అంతర్వేది మరియు విశాఖ తీర ప్రాంతాలలో సముద్రం కొంతవరకూ ముందుకు రావడం అనేది చూసిన తీరప్రాంత ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

సముద్రం ఇలా ముందు కి రావడానికి కారణం క్లైమేట్ చేంజ్ తో పాటు మానవ తప్పిదాలే అని శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు వాతావరణంలో పెరుగుతున్న కార్బన్ శాతం వల్ల మంచుకొండలు కరిగి దాని వల్ల వచ్చిన నీరు సముద్రంలో కలవడం వల్ల సముద్ర తీర ప్రాంతాలను ఆక్రమిస్తున్నాయి శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇప్పటికైనా మానవులు వాతావరణంలోని కార్బన్ ను విడుదల చేసే వనరుల వాడకం తగ్గించడం మరియు వాయు కాలుష్యాన్ని తగ్గించి నట్లయితే ఈ ప్రమాదాన్ని అరికట్టవచ్చునని లేదు అంటే ఇది ఎప్పటికైనా మానవాళికి పెనుముప్పుగా సంభవించవచ్చు అని తెలియజేశారు.