Ads
“మిత్రోన్” ప్రధాని మోదీ స్పీచ్ ఇప్పట్లో లేదే అనుకుంటున్నారా..మోదీ నోట వచ్చే మిత్రోన్ పదం చాలా పాపులర్..ఇప్పుడు ఆ పదంతోనే ఒక యాప్ రాబోతోంది..అది కూడా టిక్ టాక్ యాప్ కి పోటీగా..నెలరోజుల వ్యవధిలోనే డిజైన్ చేయబడడం, మార్కెట్లోకి రావడం 50లక్షల యూజర్స్ ని సొంతం చేసుకోవడంతో మిత్రోన్ యాప్ ప్రస్తుతం టాక్ ఆఫ్ ది యాప్స్ గా ఉంది. ఇప్పటికే టిక్ టాక్ యాప్ పై వ్యతిరేకత బారీగా పెరిగిపోతుంది..ఇప్పుడు అదే మిత్రోన్ యాప్ కి ప్లస్ అయ్యేలా ఉంది..
Video Advertisement
మనదేశంలో టిక్ టాక్ ను బ్యాన్ చేయాలనే డిమాండ్లు మొదటి నుండి వినిపిస్తున్నాయి..ఇప్పుడు ఆ తీవ్రత మరింత ఎక్కువగా ఉంది..దానికి కారణాలు కరోనా వైరస్ వ్యాప్తికి కారణం చైనా అని, టిక్ టాక్ యాప్ కూడా చైనాదే అనే ఉద్దేశ్యంతో చాలామంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.దాంతో పాటు ఇటీవల యూట్యుబర్స్ కి,టిక్ టాకర్స్ మధ్య జరిగిన చిన్నపాటి యుద్దం వలన గూగుల్ ప్లే స్టోర్ లో యాప్ కు దారుణమైన రేటింగ్ ఇస్తున్నారు.
టిక్ టాక్ కు పోటీగా డిజైన్ చేసిన “మిత్రోన్” యాప్ ను అనేకమంది వినియోగిస్తున్నారు. మిత్రోన్ యాప్ ను ఐఐటీ రూర్కీ విద్యార్థి శివాంక్ అగర్వాల్ రూపొందించాడు. కేవలం నెల రోజుల్లో ఈ యాప్ డిజైన్ చేయడం, డిజైన్ చేసిన తక్కువ సమయంలోనే 50లక్షలకు పైగా యూజర్స్ సొంతం చేసుకోవడంతో ఇండియాలో టిక్ టాక్ కు కాలం చెల్లినట్లేనని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం ప్లే చార్ట్ లో ఫ్రీ యాప్స్ జాబితాలో మిత్రోన్ 12వ స్థానంలో ఉంది.
ప్రస్తుతం కేవలం ఆండ్రాయిడ్ ఫోన్స్ లో మాత్రమే అందుబాటులో ఉన్న ఈ యాప్, ఐవోఎస్ వినియోగదారులకు మరికొద్ది కాలంలో అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం టిక్ టాక్ పట్ల ఉన్న వ్యతిరేకతే, మిత్రోన్ యాప్ యూజర్ల సంఖ్య పెరగడానికి కారణమని చెప్తున్నరు నిఫుణులు. యాప్లో కొన్ని ఎర్రర్స్ వెలుగులోకి రావడంతో ఆ యాప్ ను మరింత సౌకర్యవంతంగా డిజైన్ చేస్తున్నట్టు మిత్రోన్ సంస్థ వెల్లడించింది.
దేశంలో ఏ యాప్ పై లేనంత వ్యతిరేకత తొలి నుండి టిక్ టాక్ యాప్ యే మూటకట్టుకొంటుంది. దీని వలన కొందరు వారి వారి టాలెంట్ ను బయటపెట్టుకుంటుంటే, చాలామంది తమ టైం అంతా టిక్ టాక్ కే వెచ్చిస్తున్నారని, అంతేకాకుండా కొందరు హద్దులు మీరి ప్రవర్తిస్తున్నరనే నెగటివిటి మొదట్నుండి ఉంది..ఇప్పుడు స్వదేశీ-(వోకల్ ఫర్ లోకల్ ) అనే కామెంట్ దీనికి మరింత ఆజ్యం పోసింది..టిక్ టాక్ వర్సెస్ మిత్రోన్ యాప్ యుద్దంలో మిత్రోన్ యాపే గెలిచేటట్టుంది..చూడాలి..
Android >> Download Here
iOS >>> Download Here (available soon)
End of Article